ఆర్థిక మాంధ్యం, లాభాల క్షీణత, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వ్యాపార భయలు.. కారణం ఏదైతేనేని రోడ్డున పడుతున్నారు ఉద్యోగులు. ఈ క్రమంలోనే ఓ కంపెనీ 11 వేల మందిని తీసేసి నాలుగు నెలలు గడవకముందే.. మరో 10 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
యూఎస్ లోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ లో పతనం వల్ల 'లే ఎఫ్' ప్రభావం చాలా గట్టిగానే పడబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు లక్షకు పైగా ఉద్యోగాలు ప్రమాదంలో పడబోతున్నాయని అంటున్నారు.
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మరింతగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ ట్విట్టర్ ఉద్యోగిని నెట్టింట అవహేళన చేస్తూ మాట్లాడి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ ఉద్యోగికి బహిరంగంగా క్షమాపణ చెప్పారు.
ఎలన్ మస్క్.. ఈ పేరు వినగానే సక్సెస్ ఎంతగా గుర్తొస్తుందో కాంట్రవర్సీలు కూడా అలాగే గుర్తొస్తాయి. ట్విట్టర్ ని కొనుగోలు చేసిన తర్వాత ఆయన నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అలాంటి వార్తలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మొన్నటివరకు ఐటీ కంపెనీలు మాత్రమే ఉద్యోగులకు పింక్ స్లిప్ లు ఇవ్వగా, ఇప్పుడు అన్ని రంగాల కంపెనీలు అదే దారిలో నడుస్తున్నాయి. తాజాగా, దేశంలో నిషేధం ఎదుర్కొంటున్న సోషల్ మీడియా యాప్ ఒకటి భారత ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది.
ఇటీవల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ లో నెలకొన్న అనిచ్చితి కారణంగా ఐటీ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ట్విట్టర్, మెటా, ఫేస్ బుక్ .. తమ సంస్థలోని కొందరు ఉద్యోగులను తొలగించింది. అలానే పలు ఇతర సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా కొందరు ఉద్యోగులను తొలగించుకుని ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటి బాటలోనే తాజాగా మరో కంపెనీ వచ్చి చేరనుంది. ప్రముఖ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ కంపెనీ ఉద్యోగులను తొలగించాలనే ఆలోచన […]