యూఎస్ లోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ లో పతనం వల్ల 'లే ఎఫ్' ప్రభావం చాలా గట్టిగానే పడబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు లక్షకు పైగా ఉద్యోగాలు ప్రమాదంలో పడబోతున్నాయని అంటున్నారు.
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నాసరే ‘లే ఆఫ్స్’ (ఉద్యోగాలు తొలగింపు) అనే మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ప్రపంచస్థాయి సంస్థలైన మెటా, గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి వాటిలోనే వేలాది మందిని సాగనంపేస్తున్నారు. ఇప్పుడు వై-కాంబినేటర్ అనే సంస్థ భారీ ప్రమాదం పొంచి ఉందని యూఎస్ ట్రెజరీ సెక్రటరీకి లేఖ రాసింది. తాము ఇన్వెస్ట్ చేసిన వేలాది స్టార్టప్ సంస్థలు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ వల్ల ప్రమాదంలో పడబోతున్నాయని చెప్పుకొచ్చింది. అందులో భారత్ కు చెందిన 200 స్టార్టప్ సంస్థలు కూడా ఉన్నాయని పేర్కొంది. దీని వల్ల లక్షకు పైగా ఉద్యోగాలు రిస్కులో పడ్డాయని చెప్పుకొచ్చింది. దీంతో అమెరికాలో ఉన్న చాలామంది ఉద్యోగులు ఆందోళనలో పడిపోయారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. వై కాంబినేటర్ సీఈఓ, అధ్యక్షుడు అయిన గ్యారీ టన్ యూఎస్ ట్రెజరీ సెక్రటరీకి లేఖ రాశారు. తాము 56 వేల మంది ఆధారపడి ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సిలికన్ వ్యాలీ బ్యాంక్ లో పతనం 10 వేల స్టార్టప్ లపై ప్రభావం చూపించినుందని తద్వారా దాదాపు లక్షకు పైగా ఉద్యోగాలు రిస్తులో పడ్డాయని గ్యారీ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తమని ఆదుకోవాలని ఆయన తన లేఖలో సూచించారు. రాబోయే నెల రోజులకు సరిపడా డబ్బులు మాత్రమే ఉన్నాయని కూడా గ్యారీ పేర్కొన్నారు. సరాసరి 10 మంది ఉద్యోగులు ఉన్న స్టార్టప్ లపై ఈ లే ఆఫ్ ప్రభావం పడినా సరే దాదాపు లక్షకు పైగా ఉద్యోగాలు కోల్పోయే ఛాన్స్ ఉందని గ్యారీ టన్ చెప్పుకొచ్చారు. మరి ఈ విషయమై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.