20 వేల లోపు కొత్త పెట్రోల్ బైక్ దొరకడమే కష్టం. అలాంటిది ఎలక్ట్రిక్ బైక్ దొరకడం అంటే ఇంపాజిబుల్. అది కూడా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణం చేసే ఎలక్ట్రిక్ బైక్. అందులోనూ కేఫ్ రేసర్ లుక్‌లో బైక్ అంటే ఛాన్సే లేదు. ఈ స్పెసిఫికేషన్స్‌లో బైక్ కావాలంటే కనీసం లక్షా యాభై నుండి 2 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాలి. ఈ 20 వేల ప్రైజ్‌లో ఆ రేంజ్ బైక్ కాదు కదా, కనీసం ఎలక్ట్రిక్ సైకిల్ కూడా రాదు. అది తెలిసే ఈ యువకుడు తన పాత బండిని ఎలక్ట్రిక్ వెహికల్‌గా మార్చుకున్నాడు. ఇతనొక యూట్యూబర్. ‘క్రియేటివ్ సైన్స్’ అనే యూట్యూబ్ ఛానల్‌లో పాత వెహికల్స్‌ని రీమోడిఫికేషన్ చేసి అప్‌లోడ్ చేస్తుంటాడు.
తాజాగా ఈయన తన దగ్గరున్న పాత సుజుకీ ఏఎక్స్ 100 బైక్‌ని ఎలక్ట్రిక్ కేఫ్ రేసర్ బైక్‌గా కన్వర్ట్ చేసుకున్నాడు. పాత ఇంజిన్, పెట్రోల్ ట్యాంక్‌ని తొలగించి.. 17 ఇంచ్ 1200 వాట్ బిఎల్‌డిసి మోటార్, 48/60 వోల్ట్స్ బిఎల్‌డిసి కంట్రోలర్, లిథియం అయాన్ బ్యాటరీని అమర్చాడు. ఈ కన్వర్షన్ కిట్ కోసం తనకి జీఎస్టీతో కలిపి రూ. 18,500 ఖర్చయ్యిందని తెలిపాడు ఆ యువకుడు. ధర తక్కువగా ఉంది కదా అని ఆ బైక్‍ని సాధారణంగా ఏమీ చేయలేదు. బ్రాండెడ్ ఈవీ కంపెనీలు ఎలా అయితే చేస్తాయో అంతే గొప్పగా, ఆకర్షణీయంగా, స్టైలిష్‌గా, యూనిక్‌గా తయారుచేశాడు.
సింగిల్ సీట్ సెట్ బైక్‌పై కూర్చుని ఆ యువకుడు బైక్ నడుపుతుంటే చూడ్డానికి రెండు కళ్ళూ చాలడం లేదు. గుర్రపు స్వారీ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆన్ లైన్‌లో కన్వర్షన్ కిట్ కొని.. ఇలా సొంతంగా బైక్ తయారుచేసుకోవడమంటే మామూలు విషయం కాదు. కానీ ఈ యువకుడు అవలీలగా చేసేశాడు. అది కూడా ఆర్‌ఎక్స్ 100 కేఫ్ రేసర్ లుక్ వచ్చేలా డిజైన్ చేశాడు. ఈ బైక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని యువకుడు తెలిపాడు. ఇక దీన్ని రోడ్డుపై నడిపేందుకు ఆర్టీవో, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కోసం అప్లై చేసినట్లు ఆ యువకుడు వెల్లడించాడు.
ఈ బైక్‌ను ప్యాషన్‌తో చేసిందే తప్ప, డబ్బుల కోసం చేయలేదని ఆ యువకుడు అన్నాడు. అసలే పెట్రోల్ రేట్లు మండిపోతున్నాయి. దానికి తోడు ఈ బండ్లు కూడా తాగుబోతులుగా తయారయ్యాయి. మరి ఈ తాగుబోతు బైక్‌ల నుండి బయట పడాలంటే ఎలక్ట్రిక్ వాహనాలే దిక్కు. కొత్తవి కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. అలా అని పెట్రోల్‌తో రాజీ పడలేము అనుకునేవాళ్ళు ఈ కన్వర్షన్ కిట్స్‌ని ట్రై చేస్తే బెటర్. సమీప మెకానిక్‌ని సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటే మంచిది. మరి ఈ యువకుడు చేసిన ఎలక్ట్రిక్ కేఫ్ రేసర్ బైక్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.