స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. వన్‌ప్లస్10టీ పేరుతో దీన్ని ఇండియన్ మార్కెట్లో తీసుకొచ్చింది. ఈ 5జీ మొబైల్ ప్రారంభ ధర రూ. 49,999గా ఉంచింది. వన్‌ప్లస్ 10 సిరీస్‌లో ఇంతకుముందు తీసుకొచ్చిన వన్‌ప్లస్ ప్రో కంటే అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చింది. అలాగే తొలి వన్‌ఫ్లస్ 16 జీబీ స్మార్ట్‌ఫోన్. ఐకానిక్ అలర్ట్ స్లైడర్‌ను తొలగించిన తొలి వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే.. వన్‌ప్లస్ 10టీ ధర, ఆఫర్: వన్‌ప్లస్ 10టీ బేస్ మోడల్.. 8జీబీ/128 జీబీ వేరియంట్ ధర రూ. 49,999కాగా,12 జీబీ, 256 జీబీ వేరియంట్ ధర రూ. 54,999గా ఉంది. ఇక.. హై ఎండ్ మోడల్ 16 జీబీ, 256 జీబీ వేరియంట్ ధర రూ.55,999గా ఉంది. అయితే.. అమెజాన్ వన్‌ప్లస్ 10టీపై భారీ ఆఫర్లు పరకటించింది. ఐసీఐసీఐ, లేదా ఎస్బీఐ కార్డుల ద్వారా వన్‌ప్లస్ 10టీ 5జీని కొనుగోలు చేస్తే, రూ. 5,000 తక్షణ తగ్గింపు పొందవచ్చు. అలాగే.. అమెజాన్ పే బ్యాక్ ప్రీ-ఆర్డర్ చేసుకుంటే మరో రూ.1,000 అదనంగా తగ్గింపు లభిస్తుంది. మొత్తంగా రూ.6000 డిస్కౌంట్ లభించనుంది. వన్‌ప్లస్ 10టీ 5జీ స్పెసిఫికేషన్స్: 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లూయిడ్ అమొలెడ్ డిస్‌ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్1 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ OS 12.1 ట్రిపుల్ కెమెరా సెటప్ (50ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ) 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4800ఎంఏహెచ్ బ్యాటరీ 150వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మూన్‌స్టోన్ బ్లాక్ , జేడ్ గ్రీన్ కలర్స్‌లో, మూడు స్టోరేజ్ ఆప్షన్‌లలో లభ్యం. OnePlus 10T ప్రీ బుకింగ్ షురూ అయ్యాయి. ఓపెన్ సేల్స్ ఆగస్టు 6న ప్రారంభం కానున్నాయి. అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. రూ. 6,000 తగ్గింపుతో వన్‌ప్లస్ 10టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే.. ఈ లింక్ OnePlus 10T 5G పై క్లిక్ చేయండి. @Snapdragon 8+ Gen 1 ⚡️ 150W SUPERVOOC charging ️ 16 GB RAM Image Clarity Engine 2.0 Evolve Beyond Speed with the performance powerhouse #OnePlus10T 5G — OnePlus (@oneplus) August 3, 2022 ఇదీ చదవండి: Upcoming Smartphones: ఆగష్టులో లాంచ్ కానున్న స్మార్ ఫోన్స్ లిస్టు ఇదే..! ఇదీ చదవండి: OnePlus Nord Buds CE: చౌకైన TWS ఇయర్‌బడ్స్ లాంచ్ చేసిన ‘వన్‌ప్లస్’.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..!