స్మార్ట్ ఫోన్ తో మనిషికి విడదీయలేని అనుబంధం ఏర్పడింది. ఫోన్ లేకుండా ఒక్క పూట గడవలేని పరిస్థితికి మనిషి చేరుకున్నాడు. ఇక నిత్యం స్మార్ట్ ఫోన్ వినియోగిస్తే.. చార్జింగ్ సమస్య తలెత్తుతుంది. అందుకు చాలా మంది తమతో పాటు పవర్ బ్యాంక్ లు తీసుకెళ్తుంటారు. ప్రస్తుతం పవర్ బ్యాంక్ లకు కూడా భారీగానే గిరాకీ ఉంది. ఇప్పటి వరకు మార్కెట్‌లో 80 వేల నుంచి 1000 mAh పవర్ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. అయితే చైనాకు చెందిన హ్యాండ్ గెంగ్ అనే యూట్యూబర్ ప్రపంచంలోనే అతి పెద్ద పవర్ బ్యాంకును కనిపెట్టి ఔరా అనిపిస్తున్నాడు. ఆ పవర్ బ్యాంక్ వివరాలు..
ఒకే సారి 5 వేల ఫోన్ లకు చార్జింగ్
హ్యాండ్ గెంగ్ తయారుచేసిన పవర్‌బ్యాంకు 27,000,000mAh సామర్థ్యాన్ని కల్గి ఉంది. దీంతో ఏకంగా 5 వేల స్మార్ట్‌ఫోన్స్‌ను ఛార్జింగ్ చేయవచ్చునని ఈ యూట్యూబర్ తెలిపాడు. గెంగ్ తనకున్న వెల్డింగ్ స్కిల్స్ తో ఎంఐ తరహాలో అతిపెద్ద పవర్ బ్యాంక్ ను అభివృద్ధి చేశాడు. ఈ పవర్ బ్యాంక్ లోపల మిడ్ సైజ్ డ్ ఎలక్ట్రిక్ కార్ కు సరిపోయే కెపాసిటీ బ్యాటరీలను ఏర్పాటు చేశాడు. దాంతో పాటుగా 60 పవర్ సాకెట్లను అమర్చారు.
స్మార్ట్‌ఫోన్స్ ఛార్జింగ్ ఒక్కటే కాదు..!
గెంగ్ తయారుచేసిన పవర్‌బ్యాంకుతో నేరుగా మొబైల్ ఫోన్స్ మాత్రమే కాకుండా ఇతర పవర్ బ్యాంకులకు కూడా ఛార్జింగ్ ఎక్కించుకునే విధంగా తయారు చేశాడు. స్మార్ట్‌ఫోన్సే కాకుండా టీవీ, వాషింగ్ మెషీన్, ఎలక్ట్రిక్ కుకర్‌ను కూడా నడపవచ్చునని తెలిపాడు గెంగ్.