యాపిల్ కంపెనీ నుంచి ఇటీవల విడుదలైన ఐఫోన్ 14 సిరీస్ మొబైల్స్ విక్రయాలు భారత్‌లో నేడు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇవి యాపిల్ అధికారిక స్టోర్ సహా, ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్స్‌కు సంబంధించి సెప్టెంబర్ 9 నుండి బుకింగ్‌లు ప్రారంభం కాగా, సెప్టెంబర్ 16, శుక్రవారం నుంచి మనదేశంలో విక్రయాలు ప్రారంభమయ్యాయి. వీటి ధరల ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం..
ముందుగా iPhone 14 మోడల్ ధరల విషయానికొస్తే..
iPhone 14 Plus మోడల్ ధరల విషయానికొస్తే..
iPhone 14 Pro మోడల్ ధరల విషయానికొస్తే..
చివరగా iPhone 14 Pro Max మోడల్ ధరల విషయానికొస్తే..
ఐఫోన్ 14 సిరీస్ మోడళ్లను కొనుగోలు చేసే కస్టమర్లు హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ ద్వారా 54,900 కు మించి చేసే ఆర్డర్‌లపై రూ.6,000 తక్షణ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అలాగే, మీరు పాత ఐఫోన్ మోడల్‌లను ఐఫోన్ 14/ఐఫోన్ 14 ప్రో మోడళ్లతో ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా దాదాపు రూ.46,120 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే.. ఈ విలువ మీ ఫోన్ పరిస్థితి మీద ఆధార పడి ఉంటుంది. ఈ ఆఫర్లు దేశంలోని ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంటాయి.
ఇక, ఈ కామర్స్ సైట్లయిన ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఐఫోన్ 14 ప్రోని కొనుగోలు చేస్తే.. రూ.4,000 తగ్గింపు లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఫ్లిప్‌కార్ట్ లో యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే.. 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఐఫోన్14 సిరీస్ ధరలు, ఆఫర్లపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.