టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన ఐఫోన్ 14 వారం రోజుల క్రితమే మన దేశంలో అడుగుపెట్టింది. ఇంకా, కొనుగోలు దారుల చేతుల్లోకి మొబైల్ వచ్చి చేరనే లేదు. ఈ తరుణంలో పిడుగులాంటి వార్త అందింది. ఐఫోన్ 14 అమ్మకాలపై నిషేధం విధిస్తూ బ్రెజిల్ కీలక నిర్ణయం తీసుకుంది. అడాప్టర్ లేకుండా ఐఫోన్‌లను విక్రయించడమే అందుకు కారణం. మరి మనదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
యాపిల్ సంస్థ 2020లో విడుదల చేసిన ఐఫోన్ 12 విక్రయాల నుంచీ.. ఐఫోన్ బాక్స్‌లలో పవర్ అడాప్టర్లు, హెడ్‌ఫోన్లు చేర్చటం నిలిపివేసింది. అంతకు ముందు యాపిల్ వాచ్ బాక్స్‌ల నుంచి కూడా పవర్ అడాప్టర్లను తీసివేసింది. ఐఫోన్లతో పాటు అడాప్టర్లు కలిపి విక్రయించకపోవటం వల్ల.. ప్యాకేజీల పరిమాణం చిన్నగా ఉంటుందని, అది తమ సంస్థ కలిగించే పర్యావరణ నష్టం తగ్గటానికి కొంతమేర దోహదపడుతుందని కొంటె సాకుగా చెప్పుకొస్తోంది. ఈ విషయంపై బ్రెజిల్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. తమ దేశంలో పవర్ అడాప్టర్ లేకుండా ఐఫోన్‌లను అమ్మకూడదని పేర్కొంది.
“కొత్త ఐఫోన్లతో పాటు పవర్ అడాప్టర్‌లను కలిపి అమ్మకూడదన్న యాపిల్ నిర్ణయం.. వినియోగదారుల పట్ల వివక్ష చూపటమేనని, అది అసంపూర్ణ ఉత్పత్తి అవుతుందని బ్రెజిల్ వినియోగదారు సంస్థ సెనాకాన్ పేర్కొంది. కొత్త ఐఫోన్ 14, 14 ప్రోలతో పాటు యాపిల్ వాచ్ అల్ట్రాలను ప్రదర్శించటానికి ఒక రోజు ముందు బ్రెజిల్ ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ఈ నిషేధంపై అప్పీలు చేస్తామని యాపిల్ సంస్థ పేర్కొంది. ఇదిలాఉంటే.. మన దేశంలో వీటిపై ఎలాంటి నిషేధం లేదు. ఒకేవేళ కేంద్రం పరిశీలిస్తోన్న ‘వన్ నేషన్.. వన్ చార్జర్’ విధానం అమలులోకి వస్తే ఏవైనా మార్పులు ఉండవచ్చు. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలోతెలియజేయండి.
Apple has been under investigation in Brazil since December last year for several issues including “the sale of an incomplete product” and “discrimination against the consumer” by offering iPhone 12s and newer versions without chargers for power outlets. pic.twitter.com/Syz99eBY40
— ABS-CBN News Channel (@ANCALERTS) September 7, 2022