ప్రస్తుతం అంతా స్మార్ట్ ఫోన్ ఎరా నడుస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కో ఆండ్రాయిడ్ అప్డేట్ వర్షన్ కు విభిన్న, అద్భుతమైన ఫీచర్స్ ను అందిస్తున్నారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ 13లో ఫీచర్స్ అంతకు మించి ఉండనున్నట్లు తెలుస్తోంది. 13 వర్షన్ తో వచ్చే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒకే ఇ-సిమ్ పై రెండు నంబర్లు వాడుకునే వెసులుబాటు కూడా రానున్నట్లు చెబుతున్నారు. అసలు ఆండ్రాయిడ్-13లో ఎలాంటి ఫీచర్స్ ఉండబోతున్నాయో చూద్దాం.
ఇదీ చదవండి: కొంపముంచిన అత్యాశ! అమాయకుడిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు
ఆండ్రాయిడ్ 12 ఫీచర్స్ కే స్మార్ట్ ఫోన్ యూజర్లు ఫిదా అవుతున్నారు. ఇంక 13 అంటే తప్పకుండా మరో రేంజ్ లో ఉండబోతున్నాయనే చెప్పాలి. ఆండ్రాయిడ్ 13 ఫోన్లలో ఒకే ఇ-సిమ్ తో రెండు వేర్వేరు నెట్‌వర్క్ నంబర్లను కూడా వాడుకోవచ్చని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన టెక్నాలజీని ‘మల్టిబుల్ ఎనేబుల్డ్ ప్రొఫైల్స్’ అంటారు. ఆ సాంకేతికతకు సంబంధించిన పేటెంట్ ను 2020లోనే గూగుల్ సొంతం చేసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆండ్రాయిడ్ 13లో ఆ ఫీచర్ ను ఇంక్లూడ్ చేయనున్నట్లు సమాచారం. అదే జరిగితే రెండు వేర్వేరు నెట్‌వర్కులకు చెందిన రెండు ప్రొఫైళ్లను ఒకే ఇ-సిమ్ లో ఉంచుకోవచ్చు. నెట్ వర్క్ ను ఎంతో సులువుగా మార్చుకోవచ్చు.
ఆ ఒక్కటే కాదు.. ఆండ్రాయిడ్ 13లో వాల్‌పేపర్ ఎఫెక్ట్స్, సరికొత్త మీడియా కంట్రోల్స్ ను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ తో వాల్ పేపర్ ఎఫెక్ట్స్ సినిమాటిక్ రేంజ్ లో ఉండబోతున్నట్లు చెబుతున్నారు. మీడియా అవుట్ పుట్ పికర్ ను రీ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెనూ నుంచే నేరుగా కొత్త డివైజ్ ను పెయిర్ చేసేందుకు వీలుంటుందని సమాచారం. అంతేకాకుండా యాప్స్ నుంచి షేర్ చేసే ఫీచర్ ను కూడా అప్డేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకే క్లిక్ తో మీడియా ఫైల్స్ ను ఒక డివైజ్ నుంచి మరో డివైజ్ కు షేర్ చేయచ్చని చెబుతున్నారు. ఆండ్రాయిడ్ 13 ఫోన్లలో మరో కొత్త ఫీచర్ ‘మీడియా టీటీటీ’ని పరిచయం చేయబోతున్నారు. ఆ ఫీచర్ తో బ్లూటూత్ మీడియా స్పీకర్ లేదా ఓ డివైజ్ కు దగ్గరగా వెళ్లగానే మీడియా ఫైల్స్ ట్రాన్స్ ఫర్ చేయచ్చు. ఇవి మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో సరికొత్త ఫీచర్స్ ఆండ్రాయిడ్ 13 ఫోన్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకే ఇ-సిమ్‌తో రెండు నంబర్లు వాడుకోవడం మంచి ఫీచరేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Google Android 13 vs Apple iOS 15.4.1 – Battery Status Widget pic.twitter.com/0krz9b8Y4c
— TechDroider (@techdroider) April 2, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.