ఎప్పుడూ దూకుడు మంత్రాన్ని పఠించే క్రికెటర్ల లిస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ముందంజలో ఉంటాడు. అయితే కోహ్లీలో ఈ మధ్య భారీ మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. అతడిలో మునుపటి స్థాయిలో అగ్రెషన్, ఫైర్ కనిపించడం లేదు.
విరాట్ కోహ్లి.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎంతగానో అభిమానించే క్రికెటర్. ప్రస్తుత వరల్డ్ క్రికెట్లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ప్లేయర్ కోహ్లీనే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన బ్యాటింగ్‌తో కోట్లాది మంది మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు విరాట్. కృష్టి, పట్టుదల, జట్టు విజయం ఆఖరి క్షణం వరకు పోరాడే తత్వం అతడ్ని ఈస్థాయికి తీసుకొచ్చాయి. అయితే తన గేమ్‌తోనే కాదు యాటిట్యూడ్‌తోనూ ఫ్యాన్స్ మనసులను దోచుకున్నాడు కోహ్లి. అతడి అగ్రెషన్, ఫైర్‌ను చాలా మంది ఇష్టపడతారు. భారత జట్టులోని ప్లేయర్లను ఎవరైనా ప్రత్యర్థి ఆటగాళ్లు గెలికితే చాలు గొడవకు దిగేవాడు విరాట్. ‘పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్’ అనే డైలాగ్ కోహ్లీకి బాగా సెట్ అవుతుంది. ఎదురుగా ఎవరు ఉన్నా ‘తగ్గేదేలే’ అనే యాటిట్యూడ్‌ను మెయింటెయిన్ చేసేవాడు విరాట్.
ముఖ్యంగా టీమిండియా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత కోహ్లీలో యాటిట్యూడ్ ఇంకా పెరిగింది. దూకుడుకు మారుపేరుగా చెప్పుకునే కోచ్ రవిశాస్త్రి.. కోహ్లీలో అగ్రెషన్ లెవల్స్‌ను పెంచాడు. సహజంగానే దూకుడుగా ఉండే విరాట్‌లో దూకుడును మరింత పెంచాడు రవిశాస్త్రి. దీని వల్ల భారత క్రికెట్‌కు మంచే జరిగింది. ముఖ్యంగా విదేశీ గడ్డపై టీమిండియా దూకుడుగా ఆడింది. కోహ్లీ తన టీమ్‌మేట్స్‌లో ఎప్పుడూ జోష్ నింపుతుండేవాడు. కెప్టెన్‌గా దూకుడైన నిర్ణయాలతో ప్రత్యర్థుల పనిపట్టేవాడు. స్లెడ్జింగ్‌కు మారుపేరుగా చెప్పుకునే ఆస్ట్రేలియాను కూడా కోహ్లీ భయపెట్టాడు. భారత ప్లేయర్ల జోలికి వస్తే కోహ్లీ స్లెడ్జ్ చేస్తాడని ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు భయపడేవారు. అయితే రవిశాస్త్రి కోచ్ పదవి నుంచి దిగిపోవడం, కోహ్లీ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడం తక్కువ వ్యవధిలోనే జరిగాయి. ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో విరాట్‌లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. కానీ ఈమధ్యే కోహ్లీ తిరిగి ఫామ్ అందుకున్నాడు. అయితే ఐపీఎల్ తర్వాత నుంచి అతడిలో మునుపటి దూకుడు కనిపించడం లేదు.
ప్రత్యర్థి ప్లేయర్లు రెచ్చిపోయి ఆడుతున్నప్పుడు వారిని స్లెడ్జింగ్‌తో డిస్ట్రబ్ చేసే కోహ్లీ.. వరల్డ్ టెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో సైలెంట్‌గా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన కప్ ఫైట్‌లో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ లాంటి బ్యాటర్లు భారత బౌలర్లను ఉతికి ఆరేస్తున్నా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ మిన్నకుండిపోయాడు. ఫైనల్లో ఓటమి తర్వాత కూడా ‘మౌనమే అతి గొప్ప బలానికి మూలం’ అంటూ సోషల్ మీడియాలో కోహ్లీ కొటేషన్ షేర్ చేశాడు. ఇవన్నీ చూసిన ఫ్యాన్స్.. కోహ్లీ ఎందుకిలా తయారయ్యాడని తెగ ఫీలైపోతున్నారు. ఎలా ఉండేటోడు ఎలా అయిపోయాడని బాధపడుతున్నారు. ఫైర్ లాంటి కోహ్లి ఫ్లవర్‌లా మారిపోవడానికి ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్ కారణమని అంటున్నారు. నిత్యం ప్రశాంతంగా, మౌనంగా ఉండే ద్రావిడ్ ప్రభావం పడటంతోనే కోహ్లీ ఇలా అయిపోయాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. మరి.. కోహ్లిలో వచ్చిన మార్పులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Personally, I missed Virat Kohli’s captaincy yesterday. I missed his sledging. Even though we lost, he never let his bowlers down the shoulders. I’m fan of Rohit Sharma, but his test captaincy is lacking. He stands quietly, with no sledging or motivation. It’s a long game, and… pic.twitter.com/oPT1Tbcxap
— Vipin Tiwari (@vipintiwari952) June 8, 2023
Australia known as home of sledging but Virat kohli has Sledge them in their backyard 👑
Only King Kohli Can do this @imVkohli 🐐 pic.twitter.com/igzRNMi8PR
— ANSH. (@KohliPeak) June 6, 2023