ఐపీఎల్ 2022 సీజన్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటికే టీమ్స్ అన్నీ 6 మ్యాచ్ లు ఆడేశాయి. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. ఆరు మ్యాచ్లు ఆడి.. ఐదింట ఓడి, ఒకే ఒక్క విజయంతో టేబుల్ లో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడున్న పర్ఫార్మెన్స్ విషయాన్ని పక్కన పెడితే సీఎస్కేకి కొత్త తలనొప్పి మొదలైంది. అంటే ఇది కొత్తదేమీకాదు.. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచీ ఉన్నదే. అదేంటంటే.. చెన్నై ఐపీఎల్ టీమ్ లోకి శ్రీలంక ప్లేయర్లను తీసుకురావడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంక అంటే తమిళులకు ఎందుకు అంత కోపం అనేది అందరికీ తెలిసిందే. శ్రీలంకలో ఉండే తమిళులు భారత మూలాలున్న వ్యక్తులే. ఒకప్పుడు ఇండియా నుంచి శ్రీలంకకు వలసపోయిన వారే. గతంలో శ్రీలంక సైన్యం అక్కడున్న తమిళులను ఊచకోత కోసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి శ్రీలంక వారంటే తమిళులకు అస్సలు నచ్చదు.
ఇదీ చదవండి: ప్రాక్టీస్ లో బౌలింగ్ తో అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్.. క్లీన్ బౌల్డ్!
2008 ఐపీఎల్ ప్రారంభం నుంచే చెన్నై టీమ్‌పై ఆ మచ్చ ఉంటూనే ఉంది. అప్పుడు తీసుకున్న ముత్తయ్య మురళీ ధరణ్ విషయంలోనూ ఫ్యాన్స్ వ్యతిరేకించడం, దానిని లెక్కచేయకుండా యాజమాన్యం రెండేళ్లు మురళీ ధరన్‌ను కొనసాగించడం తెలిసిందే. ఈ సీజన్ వేలం సమయంలోనూ చెన్నై టీమ్ యాజమాన్యంపై పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. బాయ్ కాట్ చెన్నై టీమ్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. అందుకు కారణం.. శ్రీలంకకు చెందిన స్పిన్నర్ మహీష్ తీక్షణను వేలంలో కొనుగోలు చేయడమే. ఏ మాత్రం ఫ్యాన్స్ ఫీలింగ్స్ కు విలువ ఇవ్వకుండా చెన్నై టీమ్ మొండిగా ముందుకు వెళ్తోందంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
ఇప్పుడు ఫ్యాన్స్ కోపం రెట్టింపు అయ్యింది. ఎందుకంటే న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నే గాయం కారణంగా సీజన్ నుంచి తప్పుకొన్నాడు. ఇప్పుడు అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు సీఎస్కే శ్రీలంక యంగ్ పేసర్ మతీషా పతిరానాను ఎంపిక చేసింది. ఏప్రిల్ 21న ముంబైతో జరిగే మ్యాచ్‌లో అతడిని జట్టులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచుకుంది. చెన్నై టీమ్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలకు విలువ ఇవ్వకుండా జట్టులోకి శ్రీలంక ప్లేయర్లను తీసుకుంటూ పోతున్నారంటూ విమర్శిస్తున్నారు. చెన్నై టీమ్ యాజమాన్యంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడం సరైందేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.