ప్రస్తుతం అంతా ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ మీదే అందరి దృష్టి. అన్ని జట్లు ఆస్ట్రేలియా కప్పు కొట్టేందుకు వ్యూహాలు ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గ్రూప్ స్టేజ్‌లో మ్యాచ్‌లు నడుస్తున్నాయి. ఇవాళ(అక్టోబర్ 19) గ్రూప్-బిలో 8వ మ్యాచ్‌గా జింబాబ్వే- వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. వెస్టిండిస్ కట్టడి చేయడంలో బింబాబ్వే సఫలీకృతమైందనే చెప్పాలి. 20 ఓవర్లలో వెస్టిండీస్ 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. చార్లెస్(45), రోవ్మన్ పోవెల్(28), అకీల్ హుస్సేన్(23) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. ఛతారా, ముజరబాని చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. నగరవకు ఒక వికెట్ లభించింది.
అయితే ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్ ప్రదర్శన గురించి పక్కన పెడితే.. ఒక అద్భుతమైన ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే.. రోవ్మన్ పోవెల్ ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆ సిక్సర్ చూసి అకీల్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తొలి ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసేందుకు ముజరబానీ వచ్చాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న రోవ్మన్ పోవెల్ తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతికి పరుగు రాలేదు. తర్వాత వైడ్ వేశాడు. ఆ తర్వాతి బంతిని పోవెల్ గట్టిగా బాదేసరికి ఆ బంతికాస్తా గ్రౌండ్ బయట పడింది. 137 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతిని పోవెల్ అంతే వేగంగా 104 మీటర్ల భారీ సిక్స్ గా మలిచాడు. ఆ షాట్ చూసిన నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న అకీల్ హుస్సేన్ నోరెళ్లబెట్టి, నెత్తిన చేతులు పెట్టుకుని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం అకీల్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
104 meters six by Powell #WIvZIM pic.twitter.com/1qDRg6S1gp
— Mushahid Ahmed (@Sain_Mushahid) October 19, 2022
ఇంక రెండో ఇన్నింగ్స్ విషయానికి వస్తే.. జింబాబ్వే బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. 11 ఓవర్ల వరకు జరిగిన ఆటను బట్టి చూస్తే.. జింబాబ్వే 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ వెస్లే(27) మినహా టాపార్డర్, మిడిలార్డర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 6 వికెట్లలో నలుగురు క్యాచౌట్‌గానే వెనుతిరిగారు. వెస్టిండీస్ బౌలర్లు మొత్తం ఎంతో ప్రభావం చూపిస్తూ బంతులు విసురుతున్నారు. అటు ఫీల్డింగ్‌లోనూ వెస్టిండీస్ శభాష్ అనిపిస్తోంది. అన్ని ఎంతో అద్భుతమైన క్యాచ్‌లు పట్టారు. చివర్లో ర్యాన్ బర్ల్ మీదే జింబాబ్వే ఆశలు పెట్టుకుని ఉంది. మ్యాచ్ ఫలితం ఇప్పటివరకు అయితే వెస్టిండీస్ ఫేవర్‌గానే సాగుతోంది. మరి ఏమైనా అద్భుతం జరిగితే తప్ప జింబాబ్వే గెలిచే పరిస్థితి కనిపించడం లేదు.
Match 8: Rovman Powell hits Blessing Muzarabani for a 6! 🎈 150/6 (19.3 Ov) #WIvZIM 🏝️ 🇿🇼 🔰 pic.twitter.com/f3VvsBE57j
— 𝘼𝙝𝙨𝙖𝙣 𝙠𝙝𝙖𝙣 (@Ahsan23804785) October 19, 2022