టీమిండియా మాజీ సారధి, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టీ20ల నుంచి తప్పుకోనున్నాడా? ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న ఈ ప్రపంచ కప్ ఆఖరిదా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే.. కోహ్లీ ఏడాది ముందుగానే టీమిండియా టీ20 ఫార్మాట్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లుగా గుసగుసలు. కాగా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆరంభానికి ముందే టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్టు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కెప్టెన్సీ కూడా స్వస్తి పలికాడు. అయితే వన్డే, టెస్టు ఫార్మాట్ లో ఎక్కువ కాలం కొనసాగేందుకే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఆసియా కప్ లో అత్యుత్తమ ఫామ్ తో అదరగొట్టిన విరాట్ కోహ్లీ దృష్టంతా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ పైనే ఉంది. ఇది ఆఖరి టీ20 టోర్నీ అవుతున్నందున ఎలాగైనా జట్టుకు టైటిల్ అందించాలని చూస్తున్నాడు. ఇక్కడ కోహ్లీ టీ20ల నుంచి తప్పుకోవడానికి రెండు బలమైన కారణాలను సాకుగా చూపుతున్నారు. మొదటిది.. మూడు ఫార్మాట్లలో ఆడుతూ దీర్ఘకాలం క్రికెట్ లో కొనసాగాడం కష్టం. ఇక రెండోది.. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలన్నది.. కోహ్లీ ఆలోచనట. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్లలోనూ వందకుపైగా మ్యాచ్లు ఆడిన ఏకైక టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లినే. ఈ క్రమంలో అతడు ఈ ప్రపంచ కప్ తరువాత ఈ ఫార్మాట్ నుంచి తప్పుకునే అవకాశాలు వంద శాతం ఉన్నాయి.
2012 – Two fifties
2014 – four fifties
2016 – three fifties
2021 – one fiftyVirat Kohli’s consistency in T20 World Cup is unreal 🤯#ViratKohli #India #INDvsPAK #Cricket #T20WorldCup pic.twitter.com/75tgweopMU
— Wisden India (@WisdenIndia) October 19, 2022
కోహ్లీ ముందున్న ఏకైక సవాల్ సచిన్ వంద సెంచరీలను అధిగమించడమే. ఇప్పటికే 70కి పైగా సెంచరీలు చేసినా కోహ్లీ, మూడు ఫార్మాట్లలో ఆడుతూ ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. సచిన్ రికార్డును బ్రేక్ చేయాలంటే ఇంకా 30 సెంచరీలు కావాలి. సెంచరీలు చేసే అవకాశాలు.. వన్డే, టెస్టు ఫార్మాట్ లో ఎక్కువుంటాయి. ఈ రకంగా చూస్తే కోహ్లీ టీ20 ఫార్మట్ నుంచి తప్పుకోవడం మంచి నిర్ణయమే. అయితే ఈ వ్యాఖ్యలను కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ ఖండించాడు. ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడిన ఆయన.. ‘భారత జట్టుకు సుదీర్ఘ కాలంగా ఆడుతున్న ఘనత కోహ్లిది. తన ఫామ్, ఫిట్ నెస్, పరుగుల దాహం గురించిప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జట్టును గెలిపించాలనే పట్టుదల అతడిలో చాలా ఎక్కువ. రాబోయే టీ20 వరల్డ్ కప్-2024లోనూ కోహ్లి ఆడతాడని భావిస్తున్నా. కచ్చితంగా తనకైతే ఇది చివరి టీ20 ప్రపంచకప్ కాదని చెప్పగలను” అనిచెప్పుకొచ్చాడు.
King 🥶. @imVkohli | #ViratKohli𓃵 | #T20WorldCup pic.twitter.com/27EtEdb1tQ
— Suprvirat (@ishantraj51) October 19, 2022