ఒక దేశానికి చెందిన ఆటగాళ్లు మరొక దేశానికి ఆడటం సహజమే. ఇలాంటి ఘటనలు అన్ని క్రీడల్లో ఉన్న వారి ప్రతిభ వెలుగులోకి వచ్చినప్పుడు వారి గురుంచి చర్చలు మొదలవుతాయి. అయితే, ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన క్రికెటర్లు ఇంగ్లాండ్ జట్టుకు ప్రతినిత్యం వహించారు.. వహిస్తున్నారు కూడాను. అందులో మాజీ వెటరన్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్, ప్రస్తుత ఇంగ్లాడ్ సారధి ఇయాన్ మోర్గాన్, పేసర్ జోఫ్రా ఆర్చర్, ఆల్రౌండర్ బెన్ స్టోక్స్.. ఇలా చాలామందే ఉన్నారు. వీరందరు విదేశాలకు […]
బంగ్లాదేశ్‌తో ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో గాయపడిన రోహిత్ శర్మ.. చివరి వన్డేతో పాటు తొలి టెస్టు సైతం దూరం అయ్యాడు. రెండో వన్డేలో టీమిండియా తొలుత బౌలింగ్ చేయగా.. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. క్యాచ్ అందుకో బోయి రోహిత్ గాయపడిన విషయం తెలిసిందే. అతని బొటన వేలికి గాయమైంది. వెంటనే మైదానం వీడిన రోహిత్.. ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ తీయించుకుని, చేతి కట్టుతో స్టేడియానికి వచ్చాడు. తర్వాత కూడా ఫీల్డింగ్ దిగలేదు. అయితే.. బ్యాటింగ్‌కు […]
1981 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా.. జింబాబ్వేను ఇంకా పసికూన జట్టుగానే పరిగణిస్తారు. ఆడిన తొలి వరల్డ్‌కప్‌లోనే ఆస్ట్రేలియాను ఓడించి.. పెద్ద టీమ్స్‌కు షాకిచ్చే జట్టుగా మిగిలిపోయింది జింబాబ్వే. కానీ.. 1992-2003 మధ్య కాలంలో మాత్రం.. ప్రపంచ దేశాలను భయపెట్టే జట్టుగా మారింది. అందుకు కారణం.. ఈ పసికూన జట్టులో ఒక సింహం ఉండేది. ప్రపంచంలోని ఛాంపియన్ టీమ్స్‌లో ఉండే దిగ్గజ ఆటగాళ్లను తలదన్నుతూ.. తన బ్యాటింగ్ పవర్‌తో జింబాబ్వే పసికూన జట్టే అయినా.. వళ్లు దగ్గరపెట్టుకుని […]
ఒక యుద్ధం మీదపడితే ఎలా ఉంటుందో.. జింబాబ్వే జట్టుకు అర్థమై ఉంటుంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో మంచి ప్రదర్శన కనబర్చిన జింబాబ్వేకు టోర్నీ ముగింపు సమయంలో మాత్రం కన్నీళ్లు తప్పలేదు. సూర్య సునామీలో కకావికలమైన జింబాబ్వే జట్టు.. భారీ ఓటమితో టోర్నీని ముగించింది. కనీసం పోరాడి ఓడినా.. ఒకింత ఆనందంతో స్వదేశానికి వెళ్లేది జింబాబ్వే జట్టు.. కానీ.. సూర్యకుమార్ యాదవ్ వారికి ఆ ఆనందం దక్కనివ్వలేదు. ఉగ్రరూపం దాల్చి.. చివరి ఐదు […]
టీ20 వరల్డ్ కప్ 2022.. ఎంతో రసవత్తరంగా సాగుతోంది. రోజురోజుకు టోర్నీలోని గణాంకాలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలాగైన తమ టీమ్ కు పొట్టి ప్రపంచ కప్ ను అందించాలని ప్రతీ ఆటగాడు శ్రమిస్తున్నాడు. అందరి ప్లేయర్స్ పోరాటం ఒకెత్తు అయితే నెదర్లాండ్స్ ఆటగాడు అయిన బస్ డీ లీడే పోరాటం మరోఎత్తు. గత మ్యాచ్ లో పాకిస్థాన్ బౌలర్ హారిస్ రౌఫ్ వేసిన బౌన్సర్ వల్ల గాయపడ్డాడు లీడే. కంటి కింద గాయం అవ్వడంతో దానికి […]
టీమిండియాకు కష్టాలు మొదలయ్యాయా? సెమీస్ చేరడమేనా కష్టమేనా? అంటే అవుననే సమాధానం అనిపిస్తోంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. పాకిస్తాన్, నెదర్లాండ్స్ పై నెగ్గిన భారత జట్టు అలవోకగా సెమీస్ చేరుతుందని అందరూ అంచనా వేశారు. అయితే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో ఓటమి పాలవడంపై సమీకరణాలు పూర్తిగా మారాయి. ప్రస్తుతానికి ఈ ఓటమి జట్టును బాధించకపోయినా సెమీస్ చేరాలంటే మాత్రం ఆడబోయే రెండు మ్యాచులలో మాత్రం తప్పక గెలవాల్సిందే. కాకుంటే ఈ మ్యాచులకు వరుణుడు ఆటంకం కలిగించే […]
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ లో ఏదొక అద్భుతం జరుగుతూనే ఉంది. బంగ్లాదేశ్- జింబాబ్వే మధ్య జరిగిన పోరు అయితే మరీ ఉత్కంఠగా సాగింది. ఆఖరి బంతి వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. 151 పరుగుల విజయలక్ష్యాన్ని దాదాపుగా చేరుకున్నట్లు కనిపించింది. కాసేపు బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఓటమి భయాన్ని చూపించారు. గెలవాల్సిన మ్యాచ్ లో ఆఖరి బంతికి 3 పరుగుల తేడాతో ఓడిపోయారు. బంగ్లాదేశ్ కూడా చివరి ఓవర్ వరకు […]
సాధారణంగా సినిమాల్లో ఒక డైలాగ్ చెబుతూ ఉంటారు. ప్రత్యర్థులు మ్యాచ్ గెలిస్తే మేం హృదయాలను గెలిచాం అని. బంగ్లాదేశ్- జింబాబ్వే మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఆటను గెలిస్తే.. జింబాబ్వే ఆటగాళ్లు ప్రేక్షకుల హృదయాలను గెలిచారు. ఆఖరి బంతి వరకు గెలవాలని వాళ్లు చేసిన పోరాటం ఎందరికో ఆదర్శం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి గెలవాల్సిన మ్యాచ్ లో జింబాబ్వే ఓడిపోయింది. సీన్ విలియమ్స్ చేసిన పోరాటం వృథా అయిపోయింది. ఈ మ్యాచ్ మొత్తం ఒక్కో బాల్ ఒక […]
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్.. క్రికెట్ ప్రేక్షకులకు అసలు సిసలైన టీ20 మజాని అందిస్తోంది. ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ఈ వరల్డ్ కప్ లో మాత్రం అనుకోని సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. ప్రతి మ్యాచ్ ఆఖరి బంతి వరకు సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ వరల్డ్ కప్ లో జింబాబ్వే జట్టుని ప్రత్యేకంగా అభినందిచాల్సి ఉంది. ప్రతి మ్యాచ్ లో ఎంతో గొప్ప పోరాట పటిమని చూపిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ పై జింబాబ్వే చేసిన […]
టీ20 ప్రపంచ కప్ వేటలో పాకిస్తాన్ పోరు ముగిసినట్లే కనిస్తోంది. జింబాబ్వేపై ఓడటమే అందుకు కారణం. జింబాబ్వే నిర్దేశించిన 130 టార్గెట్ ను ఛేదించలేకపోయారు.. పాక్ బ్యాటర్లు. నిర్ణీత ఓవర్లలో 129 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో ఓడారు. దీంతో పాక్ సెమీస్ చేరే అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. సెమీస్ చేరాలంటే.. తను ఆడే మిగతా మూడు మ్యాచుల్లో గెలవడంతోపాటు మిగతా జట్ల జయాపజయాలపై ఆధారపడివుంది. అయితే.. ఇక్కడ పాక్ ఓటమిని శాసించింది మాత్రం.. సికందర్ […]