‘భారత్- పాకిస్థాన్’ మ్యాచ్ అంటే ఆ మజానే వేరుంటది మరి. దయాదుల పోరు అనగానే యావత్ క్రికెట్ ప్రపంచమే ఉత్సుకతతో టీవీలకు అతుక్కుపోతుంది. క్రికెట్ అభిమానులు అలాంటి ఉత్కంఠ పోరు చూసి ఏళ్లు కావొస్తోంది. ఇప్పుడు ఐసీసీ టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఆ అవకాశం రాబోతోంది. అక్టోబరు 17 నుంచి యూఏఈ, ఒమన్ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అక్టోబరు 24న దుబాయ్ వేదికగా దాయాదీ దేశాలు తలపడనున్నాయి. ఇక అది క్రికెట్ మైదానం కాదు.. యుద్ధభూమిగానే కనిపిస్తుంది. అంతే కాదు అక్టోబరు 24న ప్రసారం కానున్న భారత్, పాక్ మ్యాచ్ అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ కు కాసుల వర్షం కురిపించనుంది.
ఇప్పటికే ఆ మ్యాచ్‌కు సంబంధించిన అన్ని ప్రణాళికలు చేసినట్లు తెలుస్తోంది. మ్యాచ్ మధ్యలో ప్లే చేసే యాడ్స్‌కు భారీ రేటు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం 10 సెకన్ల టైమ్ స్లాట్‌కు దాదాపు 25 నుంచి 30 లక్షల రూపాయాలు ధర నిర్ణయించినట్లు సమాచారం. క్రీడలకు సంబంధించి ఇంత వసూలు చేయడం ఇదే తొలిసారి అవుతుందని యాడ్ ఏజెన్సీ వర్గాలు చెబుతున్నాయి. యాడ్ ధర భారీగా ఉందని మామూలు వాళ్లు భావిస్తున్నా.. ఇప్పటికే పలు కంపెనీలతో చర్చలు ప్రారంభించినట్లు.. కొన్ని డీల్స్ కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే కేవలం ఓవర్ల మధ్య వచ్చే యాడ్స్ ద్వారానే దాదాపు 60 నుంచి 70 కోట్లు ఆదాయం రానున్నట్లు కనిపిస్తోంది. మరి, భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ మాత్రం ఉంటుందిలే అంటున్నారు క్రికెట్ అభిమానులు.
ఇదీ చదవండి: ఆగిపోయిన వాట్సప్.. భారీగా నష్టపోయిన కంపెనీ.. ఇది హ్యాకర్ల పనేనా?