బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో శ్రీలంక మహిళా క్రికెట్ జట్టుకు ఘోర పరాయజం ఎదురైంది. గ్రూప్-బీలో భాగంగా దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. కేవలం 17.1 ఓవర్లలో 46 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డు మూటగట్టుకుంది. టీ20ల్లో శ్రీలంకకు ఇదే అత్యల్ప స్కోర్. లంక ఇన్నింగ్స్‌లో కెప్టెన్ చమారీ ఆటపట్టు(15) ఒక్కరే డబుల్ డిజిట్ స్కోర్ చేసింది. సఫారీ బౌలర్ల విజృంభణ లంక ఇన్నింగ్స్‌ను కకావికలం చేసింది.
డి క్లెర్క్ (3/7), క్లాస్ (2/7), టైరాన్ (1/1), మ్లాబా (1/4), షబ్నిమ్ ఇస్మాయిల్ (1/12) లు ఇలా బౌలర్లంతా చెలరేగడంతో శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన సఫారీలు కేవలం 6.1 ఓవర్లలోనే వికెట్ నష్టాపోకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఓపెనర్లు అన్నెకె బోష్ (16 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు), తజ్మిన్ బ్రిట్స్ (21 బంతుల్లో 21; 3 ఫోర్లు) జట్టును విజయతీరాలకు చేర్చారు.
గ్రూప్ బీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓడిన శ్రీలంక.. ఈ మ్యాచ్‌లో ఓటమితో నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించగా.. లంకపై ఘన విజయం సాధించినప్పటికీ దక్షిణాఫ్రికా జట్టు కూడా నాకౌట్ పోరుకు అర్హత సాధించలేకపోయింది. సఫారీలు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయంతో 2 పాయింట్లు సాధించి గ్రూప్ బీలో మూడో స్థానంలో నిలిచారు. ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ నాకౌట్‌కు అర్హత సాధించగా.. గ్రూప్ ఏ నుంచి భారత్, ఆస్ట్రేలియాలు సెమీస్‌కు అర్హత సాధించాయి.
A thumping win for South Africa 👊#B2022 | #SAvSL | https://t.co/wH42QOoijQ pic.twitter.com/3rjfqRNthh
— ICC (@ICC) August 4, 2022
ఇది కూడా చదవండి: స్టేడియంలో బతుకమ్మ ఆడిన పాకిస్థాన్, శ్రీలంక క్రికెట్ ఫ్యాన్స్!