ధోనీ కెప్టెన్సీలో యుజ్వేంద్ర చాహల్ టీమిండియా ప్రధాన బౌలర్ గా అవతరించాడు. కానీ ప్రస్తుతం చాహల్ ని ఎంపిక చేయడమే కష్టంగా మారింది. ఈ సందర్భంగా ధోనీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.
భారత క్రికెట్ లో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఆడింది తక్కువ మ్యాచులైనా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. రెడ్ బాల్ క్రికెట్ లో అవకాశం రాకపోయినా పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఆకట్టుకునే ప్రదర్శన చేసాడు. ఇక ఐపీఎల్ అయితే ఆల్ టైం బెస్ట్ స్పిన్నర్లలో ఒకడిగా నిలిచాడు. ఒకప్పుడు తన స్థానాన్ని పర్మినెంట్ చేసుకున్న చాహల్.. ఆ తర్వాత కొన్ని నెలల పాటు జట్టులో స్థానం దక్కలేదు. అయితే తాజాగా వెస్టిండీస్ తో పరిమిత ఓవర్ల క్రికెట్ లో చాహల్ కి చోటు దక్కింది. ప్రస్తుతం టీమిండియా టెస్టు సిరీస్ అందుతుండడంతో చాహల్ ఇప్పుడు సోషల్ మీడియాయాలో ఎక్కువగా సందడి చేస్తున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా తన అనుభవాలను, అనుబంధాలను పంచుకుంటూ ఉంటాడు. ఇటీవలే ఆర్సీబీ జట్టు తనను రిటైన్ చేసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ఈ లెగ్ స్పిన్నర్.. తాజాగా ధోనిపై తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా పంచుకున్నాడు.
సాధారణంగా ఒక బౌలర్ ఒక్క ఓవర్లో ధారాళంగా పరుగులు ఇస్తే కెప్టెన్ అసహనానికి లోనవుతాడు. ఎంత బాగా బౌలింగ్ చేసినా పక్కన పెట్టేస్తాడు. ఈ సమయంలో బౌలర్ చాల ఒత్తిడికి గురవుతాడు. అయితే ధోనీ మాత్రం చాలా స్పెషల్ అని చెబుతున్నాడు యుజ్వేంద్ర చాహల్. ధోనీ నాయకత్వంలో ప్రధాన స్పిన్నర్ గా ఎదిగిన చాహల్.. తన పార్ట్నర్ కుల్దీప్ యాదవ్ తో కలిసి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. అయితే ధోనీ రిటైర్మెంట్ తర్వాత చాహల్ ఫామ్ లో ఉన్నప్పటికీ అవకాశాలు రావడం లేదు. ముఖ్యంగా టీ 20 వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచులో కూడా ఆడే అవకాశం కల్పించలేదు. దీంతో చాహల్ ధోనిని గుర్తు చేసుకుంటూ మాహీ మీద ప్రశంసల వర్షం కురిపించాడు.
“మహేంద్ర సింగ్ ధోనీ దగ్గర ఉంటే నా నోటిని అదుపులో ఉంచుకుంటాను. అనవసరంగా మాట్లాడకుండా బుద్ధిగా మాహీ అడిగిన దానికి సమాధానం చెబుతాను. లేకపోతే సైలెంట్ గా కూర్చుంటాను. ఈ సందర్భముగా నేను ధోని భయ్యా గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సౌత్ ఆఫ్రికాతో ఒక టీ 20 మ్యాచులో నేను ఏకంగా 4 ఓవర్లో 64 పరుగులు ఇచ్చేసాను. క్లాసన్ నా బౌలింగ్ లో సిక్సులు వర్షం కురిపిస్తున్నాడు. అయినా ఆ మ్యాచులో ధోనీ భయ్యా నన్ను సపోర్ట్ చేసిన విధానాన్ని మర్చిపోలేను. ఇంకో 5 బాల్స్ ఉన్నాయి. బౌండరీ రాకుండా అడ్డుకుంటే టీంకి హెల్ప్ అవుతుందని చెప్పుకొచ్చాడు. ధోనీ చెప్పిన సలహాలు పాటించిన క్లాసన్ జోరు ఆగలేదు. ఆ సమయంలో ధోనీ నా దగ్గరకు వచ్చి ఈ రోజు నీది కాదు ఈమె బాధపడకు అని అండగా నిలబడ్డాడు. ధోనీ చెప్పిన ఆ ఒక్క మాట నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది” అని చాహల్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. మరి ధోనీపై చాహల్ చ్సినా వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.