స్పాట్ ఫిక్సింగ్ భూతం ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్‌ను కూడా వణికిస్తోంది. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023లో జట్టులోలేని ఓ బంగ్లాదేశ్ క్రికెటర్ స్పాట్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఓ ఆడియో లీగ్ సంచలనం సృష్టిస్తోంది.
సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం సృష్టిస్తోంది. ఆట ప్రతిష్టాతను దెబ్బతీసే.. ఈ ఫిక్సింగ్ భూతం.. ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్‌ను కూడా తాకింది. బంగ్లాదేశ్ క్రికెటర్.. సౌతాఫ్రికా ప్లేయర్‌ను ఈ ఊబిలోకి దింపేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన ఆడియో లీగ్ క్రికెట్ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. ప్రస్తుతం వరల్డ్ కప్‌లో ఆడుతున్న బంగ్లాదేశ్ టీమ్‌లో లేని ఒక క్రికెటర్.. సౌతాఫ్రికా జట్టులోని ఓ స్టార్ ప్లేయర్‌కు ఫోన్ చేసి.. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడాల్సిందిగా కోరింది. వారి మధ్య సంభాషణ ఈ విధంగా సాగింది. బంగ్లాదేశ్ క్రికెటర్ మాట్లాడుతూ..‘నేను నిన్ను బలవంతం ఏమి చేయడం లేదు. నువ్వు ఫలానా మ్యాచ్ ఆడొద్దని నేను నీకు చెప్పను. అది నీ ఇష్టం. నువ్వే చెప్పు. ఒక మ్యాచ్ ఆడితే, తర్వాత మ్యాచ్ ఆడతావో లేదో నిర్ణయించుకో. నువ్వు టీమ్‌లో ఉండాలో లేదో మీ టీమ్ మేనేజ్‌మెంట్ డిసైడ్ చేస్తోంది.’ అని పేర్కొంది.
దానికి సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ బదులిస్తూ..‘చూడు ఫ్రెండ్.. నాకు ఇలాంటి ఇష్టం లేదు. నేను ఇలాంటి వాటిలో ఇరుక్కోవాలని అనుకోవడం లేదు. నా లైఫ్‌లో ఇలాంటి పనులు చేయను. అసలు నాకు ఇవి చెప్పొద్దు’ అంటూ గట్టిగానే బదులిచ్చింది. తనను ఫిక్సింగ్ అనే ఉచ్చులోకి లాగుదామని చూసిన బంగ్లా క్రికెటర్‌కు చెప్పాల్సిన సమాధానం చెప్పిన సౌతాఫ్రికా క్రికెటర్.. తర్వాత ఆమెకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. తనతో ఆమె మాట్లాడిన విషయాన్ని ఐసీసీ నిబంధనల ప్రకారం యాంటి కరప్షన్ యూనిట్‌కు తెలియజేసింది. దీంతో ఈ విషయంపై ఐసీసీ కూడా సీరియస్ అయినట్లు సమాచారం. ప్రతిష్టాత్మక వరల్డ్ కప్‌లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంపై ఐసీసీతో పాటు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సైతం విస్మయం వ్యక్తం చేశాయి.
అలాగే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. ఐసీసీ నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని తెలిపింది. బంగ్లా బోర్డు ఛైర్మన్ నిజాముద్దీన్ చౌదరి స్పందిస్తూ.. ఈ విషయంపై ఐసీసీ యాంటి కరప్షన్ యూనిట్‌కు ఫిర్యాదు చేసినట్లు, ఇది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విచారించే విషయం కాదని, ఈ ఘటనపై తాము ఇప్పుడు ఎలాంటి ప్రకటన చేయడం లేదని, దీనిపై నో కామెంట్ అన్నారు. అయితే.. ఈ ఘటన జరిగిన తర్వాత.. బంగ్లాదేశ్‌లోని ఓ వార్తా సంస్థలో దీనిపై కథనాలు వెలువడిన తర్వాత కూడా ఐసీసీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం. అయితే.. ఇంటర్నల్ దర్యాప్తు మాత్రం కొనసాగుతుందని సమాచారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Bangladesh’s campaign in the ongoing Women’s T20 World Cup has been hit with allegations of a spot-fixing approach made to one of their players by another cricketer
Full story: https://t.co/B18XgLuTaR pic.twitter.com/WGdr62ZUUv
— ESPNcricinfo (@ESPNcricinfo) February 15, 2023