తొలిసారి జరుగుతున్న వుమెన్స్ ఐపీఎల్ కోసం మహిళా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గట్టిగానే సిద్దం అవుతోంది. తాజాగా RCB వుమెన్స్ టీమ్ కెప్టెన్ ను విరాట్ కోహ్లీ ప్రకటించాడు. టీమ్ కెప్టెన్ గా..
ప్రపంచ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే మెగా టోర్నీ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే మెన్స్ ఐపీఎల్ షెడ్యూల్ విడుదలైన సంగతి మనకు తెలిసిందే. అయితే పురుషుల ఐపీఎల్ తో పాటుగా తొలిసారిగా మహిళా ఐపీఎల్ ను నిర్వహించడానికి సిద్దమైంది బీసీసీఐ. అందుకు సంబంధించిన వేలాన్ని ఇటీవలే పూర్తి చేసింది. ఇక మార్చి 4వ తేదీ నుంచి WPL ప్రారంభం కానుంది. తొలిసారి జరుగుతున్న వుమెన్స్ ఐపీఎల్ కోసం మహిళా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గట్టిగానే సిద్దం అవుతోంది. తాజాగా RCB వుమెన్స్ టీమ్ కెప్టెన్ ను విరాట్ కోహ్లీ ప్రకటించాడు.
తొలిసారి నిర్వహిస్తున్న వుమెన్స్ ఐపీఎల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గట్టిగానే సిద్దం అవుతున్నట్లు కనిపిస్తోంది. వేలం నుంచి కెప్టెన్ ను నియమించే వరకు పకడ్బందీగా వ్యూహాలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వుమెన్స్ ఐపీఎల్ వేలంలో టీమిండియా వుమెన్స్ వైస్ కెప్టెన్ స్మృతి మంధనకు భారీ ధర చెల్లించి కొనుగోలు చేసింది. స్మృతి కోసం RCB ఏకంగా రూ. 3.4 కోట్లు ఖర్చు పెట్టింది. దాంతో వుమెన్స్ ఐపీఎల్ లీగ్ లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రీడాకారిణిగా రికార్డ్ నెలకొల్పింది. ఇక తాజాగా వుమెన్స్ ఆర్సీబీ టీమ్ కెప్టెన్ గా స్మృతి మంధనను నియమించారు. విరాట్ కోహ్లీ, ఆర్సీబీ ప్రస్తుత కెప్టెన్ డుప్లెసిస్ లు కలిసి స్మృతి మంధనను సారథిగా ప్రకటించారు.
అయితే వుమెన్స్ ఆర్సీబీ జట్టులో మరో స్టార్ ప్లేయర్ ఎలీస్ పెర్రీ ఉన్నప్పటికీ మంధనను కెప్టెన్ గా నియమించడం విశేషం. మార్చి 4వ తారీఖు నుంచి వుమెన్స్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఐదు జట్లు పాల్గొననున్నాయి. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ ఈ టోర్నీలో తలపడనున్నాయి. మరి మహిళల ఆర్సీబీ జట్టుకు కెప్టెన్ గా స్మృతి మంధనను నియమించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Royal Challengers Bangalore has a new skipper 🔥#CricketTwitter #WPL #IPL pic.twitter.com/gNXC3txjXx
— Sportskeeda (@Sportskeeda) February 18, 2023
RCB captain in WPL – Smriti Mandhana. pic.twitter.com/cXn0TPAO8r
— Johns. (@CricCrazyJohns) February 18, 2023