ఆర్సీబీ మహిళా జట్టు.. లీగ్ లోనే తొలి గెలుపు చూసింది. అయితే దీనికి కారణం.. వాళ్ల ప్రదర్శనతో పాటు కింగ్ కోహ్లీ అంటున్నారు. విరాట్ వచ్చాడు అమ్మాయిలు మ్యాచ్ గెలిచారని మాట్లాడుకుంటున్నారు. అసలేం జరిగింది?
వరుస ఓటములు క్రికెటర్లను బాధిస్తున్నాయి. విజయం కోసం ఎంతలా శ్రమిస్తున్నపటికీ, ఫలితం అనుకూలంగా రాకపోవడం వారిని కంటతడి పెట్టిస్తోంది. ఆ దృశ్యాలు అభిమానుల హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి.
క్రికెటర్ల ఆటకు అభిమానులు ఉండటం పెద్ద విషయం కాదు.. కానీ.. వారి వ్యక్తిత్వానికి అభిమానులు ఉండటం నిజంగా గొప్ప విషయమే. ఇప్పుడు అలాంటి అభిమానాన్నే టీమిండియా క్రికెటర్ రోడ్రిగ్స్ పొందుతున్నారు.
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా బుధవారం గుజరాత్ జెయింట్స్ వర్సెస్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ సోఫియా డంక్లీ రికార్డు నెలకొల్పింది.
జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉంటే.. ఆ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ, ఐపీఎల్ ప్రాంచైజీ ఆర్‌సీబీ కథ అందుకు విభిన్నం. జట్టులో ఎంత మంది దిగ్గజ ప్లేయర్లు టీమ్‌లో ఉన్నా, విజయం మాత్రం ఆర్‌సీబీకి ఎప్పుడూ ఆమడ దూరమే. అది పురుషులైనా.. విమెన్ అయినా. 'ఈసాలా కప్ నమ్‌దే' అంటూప్రతి సీజన్‌కి ముందు ఆర్‌సీబీ అభిమానులు హడావుడి చేయడం, ఏవేవో సెంటిమెంట్ లెక్కలేసి ఈసారి మా టీమ్ దే కప్పు అని ఆర్భాటాలు చేయడమే తప్ప ఫలితం మాత్రం మారడం లేదు.
మహిళల ఐపీఎల్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ లో సత్తా చాటిన ఢిల్లీ బ్యాట్స్ వుమెన్.. తర్వాత తన మాస్ డ్యాన్స్ తో
ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
క్రికెట్‌ను అభిమానించే ఎందరికో మహేంద్ర సింగ్ ధోని ఫేవరెట్ క్రికెటర్. అంతెందుకు చాలా మంది క్రికెటర్లు అతడ్ని ఆరాధిస్తారు. అలాంటి ధోని పేరును బ్యాట్ పైకి రాసుకుని గ్రౌండ్లోకి దిగిందో బ్యాటర్. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
'డీఆర్‌ఎస్' అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించడం. ఇప్పటివరకూ బ్యాటర్ ఎల్ బీడబ్ల్యూగా ఔటైన సందర్భంలో మాత్రమే డీఆర్‌ఎస్ కోరేవారు. ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూశాం.. కానీ, మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో వైడ్, నో బాల్‌కి కెప్టెన్లు సమీక్ష కోరుతున్నారు. దీంతో ఏం జరుగుతోందా! అని అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. అందుకు కారణ.. ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
ఉమెన్స్ మ్యాచ్ ఏం చూస్తావు.. రా! ఫస్ట్ బ్యాటింగ్ ఆడినోళ్లు 200 కొడతారు.. అక్కడితో మ్యాచ్ వన్ సైడ్. ఇది తొలి రెండు మ్యాచులు ముగిశాక అందరి నోటి నుంచి వచ్చిన మాటలు. కానీ, మూడో మ్యాచ్ అందుకు తెరదించింది. విజయం సాధించాలంటే ఆఖరి 18 బంతుల్లో 53 పరుగులు కావాలి.. చేతిలో ఉన్నవి మూడే వికెట్లు.. ఈ దశలో యూపీ వారియర్స్ నిజంగానే పేరుకు తగ్గ ప్రదర్శన చేసింది. బిగ్‌బాష్ స్టార్ గ్రేస్ హ్యారిస్ (26 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 నాటౌట్) అసాధారణ రీతిలో చెలరేగి మ్యాచ్ యూపీ వశం చేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్‌లో పరుగుల వరద పారుతోంది. ఆడుతున్న తీరు.. పారుతోన్న బౌండరీలు చూస్తుంటే.. ఆడుతోంది అమ్మాయిలేనా అనిపిస్తోంది. టోర్నీ ఆరంభ మ్యాచులో ముంబై ఇండియన్స్ 207 పరుగులు చేసి ఔరా అనిపించగా.. రెండో మ్యాచ్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆ రికార్డును బద్దలుకొట్టింది. ఏకంగా 223 పరుగులు చేసి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీ చేసింది.