పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ బీసీసీఐపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషాపై పరోక్షంగా సెటైర్లు వేశాడు. భారత్‌లో క్రికెట్ పరిపాలనలో అనుభవంలేని స్పష్టం తెలుస్తోందని కామెంట్ చేశాడు. గత ఏడాది కాలంగా రెండు దేశాల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉన్న నేపథ్యంలో బీసీసీఐ పెద్దలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నాడు. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ సెక్రటరీ ఇలాంటి ప్రకటన చేయడం ఎందుకని.. దీన్ని బట్టి భారత్‌తో క్రికెట్ పరిపాలనలో అనుభవం లోపించిదని స్పష్టమవుతోందని అఫ్రిదీ ట్వీట్ చేశాడు. కాగా.. అఫ్రిదీ కామెంట్ వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే..
2008 నవంబర్ 26న ముంబైలోని తాజ్ హోటల్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత.. భారత్-పాక్ సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దౌత్యపరమైన సంబంధాలే కాకుండా.. క్రికెట్‌పై కూడా ప్రభావం పడింది. అప్పటి నుంచి పాకిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించడం కాని, భారత్ పాక్‌కు వెళ్లడం కాని జరగలేదు. కానీ.. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో మాత్రం తలపడ్డాయి. 2011 వరల్డ్ కప్ సందర్భంగా మొహాలీలో భారత్-పాక్ మ్యాచ్ జరిగింది. కానీ.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం జరగలేదు. కాగా.. మళ్లీ ఇన్నేళ్లకు ఇరుదేశాల మధ్య కొంత సానుకూల వాతవరణం నెలకొంటోంది. ఆటగాళ్లు మధ్య కూడా మంచి స్నేహ వాతావారణం ఉంది. దీంతో పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్ 2023లో భారత్ పాల్గొంటుందనే గుసగుసలు వినిపించాయి.
ఈ వార్తపై క్రికెట్ అభిమానులంతా సంతోషం వ్యక్తం చేశారు. కానీ.. తాజాగా బీసీసీఐ కార్యదర్శి జైషా ఆసియా కప్ 2023 కోసం టీమిండియా పాకిస్థాన్ వెళ్లదని తేల్చిచెప్పాడు. పాకిస్థాన్‌లో కాకుండా ప్రత్యామ్నయ వేదికలపై భారత్.. ఆసియా కప్ మ్యాచ్‌లు ఆడుతుందని ప్రకటించారు. ఈ ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేసిన అఫ్రిదీ పైవిధంగా స్పందించాడు. పరోక్షంగా బీసీసీఐ కార్యదర్శి జైషాకు క్రికెట్ వ్యవహారాల్లో ఏ మాత్రం అనుభవంలేదని సెటైర్లు వేశాడు. కాగా.. ఆసియా కప్ 2023 కోసం టీమిండియా పాకిస్థాన్ రాకుంటే.. అదే ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023ను బాయ్‌కాట్ చేసే ఆలోచనలో పాకిస్థాన్ ఉన్నట్లు సమాచారం.
When excellent comradery between the 2 sides in the past 12 months has been established that has created good feel-good factor in the 2 countries, why BCCI Secy will make this statement on the eve of #T20WorldCup match? Reflects lack of cricket administration experience in India
— Shahid Afridi (@SAfridiOfficial) October 18, 2022