వరల్డ్ బెస్ట్ పేస్ బౌలర్లు ఎవరంటే చాలా మందే గుర్తొస్తారు. అయితే ఆ లిస్టులో తప్పక ఉండే పేర్లలో పాకిస్థాన్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ ఒకడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన పేస్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు అక్తర్.
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లను చూసేందుకు ప్రతి క్రికెట్ ప్రేమికుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటాడు. అలాంటి వారికి గుడ్ న్యూస్. త్వరలో ఈ రెండు జట్లు ముఖాముఖి తలపడనున్నాయి.
ఆసియా కప్ ఎక్కడ జరగాలో ఎట్టకేలకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ తేల్చేసింది. ఆసియా కప్ 2023ను పాకిస్థాన్‌లోనే నిర్వహిస్తామని ఏసీసీ ప్రకటించినా.. బీసీసీఐ సైతం తన పంతం నెగ్గించుకుంది.
ఐపీఎల్ లో ఆడే భారత క్రికెటర్లు ఏ ఇతర టీ20 లీగ్స్ లో ఆడకూడదు అన్న నిబంధన మనకు తెలిసిందే. ఈ విషయంలో బీసీసీఐను ప్రశంసించాడు పాక్ మాజీ ఆటగాడు. అలాగే ప్రపంచంలోని ఏ టీ20 లీగ్ కూడా IPLకు సాటిరాదు అని పేర్కొన్నాడు.
క్రికెట్ నిబంధనలు ఉల్లంఘించి అవినీతి నిరోధక చట్టానికి తూట్లు పోడిచినందుకు పాక్ క్రికెటర్‌పై రెండేళ్ల పాటు నిషేధం విధించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. దేశవాళీ క్రికెట్‌తో పాటు పీఎస్‌ఎల్(పాకిస్థాన్ సూపర్ లీగ్)లో కూడా ముల్తాన్ సుల్తాన్స్ తరఫున ఆడి మంచి బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా మంచి పేరు సంపాదించుకున్న 32 ఏళ్ల ఆసిఫ్ అఫ్రిదీ అవినీతి నిరోధక నిబంధనలు ఉల్లంఘించినందుకు అతనిపై పాక్ క్రికెట్ బోర్డు రెండేళ్ల పాటు నిషేధం విధిస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ క్రికెట్ […]
గత కొన్ని రోజులుగా ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహణకు సంబంధించి ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. పాక్ లో ఆసియా కప్ నిర్వహిస్తే.. భారత జట్టు పాక్ కు రాదని టీమిండియా ప్రకటించింది. తాజాగా జరిగిన ఆసియా కప్ క్రికెట్ కౌన్సిల్ (ACC) సమావేశంలో కూడా ఆసియా కప్ వేదిక ఏది అనేది ఇంకా స్పష్టం చేయలేదు. అయితే ఆసియా కప్ ఆడటానికి భారత్, పాకిస్థాన్ రాకపోతే.. భారత్ వేదికగా జరిగే 2023 వన్డే వరల్డ్ కప్ […]
కరోనా వల్ల లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ క్లాసులను నిర్వహించారు. స్కూళ్లు, కాలేజీలు విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించడం చూశాం. అయితే క్రికెట్‌లో ఆన్‌లైన్ కోచింగ్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తొలిసారి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అలాంటి ప్రయత్నం చేస్తోంది. జట్టుకు కొత్త కోసం చూస్తున్న పాక్ క్రికెట్ బోర్డు.. గతంలో తమ టీమ్‌కు కోచ్‌గా సేవలందించిన మికీ ఆర్థర్‌ను మరోసారి తీసుకొస్తోంది. ఆయన్ను పాక్ జట్టు ఆన్‌లైన్ కోచ్‌గా నియమించింది. ప్రపంచ కప్ […]
గత కొంతకాలంగా పాకిస్థాన్ టీమ్ తో పాటుగా పాక్ క్రికెట్ బోర్డులో సైతం అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే పాక్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతుంటే.. ఇది చాలదు అన్నట్లుగా.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు తయ్యారు అయ్యింది పాక్ క్రికెట్ బోర్డు పరిస్థితి. కొన్ని రోజులుగా పాక్ జట్టు ఆటతీరుపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో బోర్డులో ఏరివేత మెుదలెట్టారు. మెుదట పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజాను తొలగించింది. అతడి స్థానంలో నజమ్ సేథీని పీసీబీ చీఫ్ […]
సూర్య కుమార్ యాదవ్.. ప్రస్తుతం పొట్టి క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు మారుమ్రోగుతోంది. స్కై అనే పేరుకు తగ్గట్లు సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. 2022 ఏడాది జోష్ ని 2023లో కూడా కొనసాగిస్తున్నాడు. శ్రీలంక మీద 45 బంతుల్లో శకతం పూర్తి చేసి మరోసారి సూర్య క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అతని బ్యాటింగ్ తీరు, అతని షాట్స్ చూసి హేమాహేమీ బౌలర్లు కూడా స్కై బౌలింగ్ అంటే మా వల్ల కాదు అనే పరిస్థితి […]
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా పదవి పోయిన తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నాడు. తనను పదవి నుంచి తొలగించిన తర్వాత పాక్ బోర్డు ఖర్చులపై వివిధ ఆరోపణలు చేసిన రాజా.. తాజాగా పాకిస్థాన్ టీమ్ ఎదుగుల గురించి మాట్లాడుతూ.. భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘పాకిస్థాన్ ముందుకెళ్లడాన్ని చూసి ఇండియా జీర్ణించుకోలేకపోయింది’ అంటూ అర్థంలేని వ్యాఖ్యలు చేశాడు. తన హయాంలో పాకిస్థాన్ క్రికెట్‌ను ఎంతో ముందుకు తీసుకెళ్లినట్లు గొప్పలు […]