రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ ఏడాది ఐపీఎల్లో రెచ్చిపోతున్నాడు. నీళ్లు తాగినంత సులువుగా సెంచరీ, హాఫ్ సెంచరీలు బాదేస్తున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో ప్లేసులో ఉన్న ఈ యంగ్ లెఫ్టాండర్ ఆటకు అందరూ ఫిదా అవుతున్నారు.
ఓ ప్రముఖ ఛానెల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే.. ఆ స్టింగ్ ఆపరేషన్ ఓ పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్లు సమాచారం. బోర్డులో వారి ఆధిపత్యం తగ్గించేందుకు ఈ స్టింగ్ ఆపరేషన్ జరిపినట్లు వార్తలు వస్తున్నాయి.
సోషల్ మీడియా యుగంలో మంచైనా, చెడైనా వెంటనే వైరలవుతున్నాయి. ఇక సోషల్ మీడియా వల్ల రాత్రికి రాత్రే స్టార్లుగా మారిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా ఓ యువతి అద్భుతమైన బ్యాటింగ్ టాలెంట్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ప్రతిభ చూసి సచిన్ సైతం ఆశ్చర్యపోతున్నాడు. ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోన్న ఆ వీడియో వివరాలు..
భారత మహిళా క్రికెటర్లు అద్భుతం చేసి చూపించారు. అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా విమెన్స్ జట్టు ముద్దాడింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్ టైటిల్‌ను గెలిచి మహిళా క్రికెటర్లు చరిత్ర సృష్టించారు. అరంగేట్ర అండర్-19 ప్రపంచకప్‌లోనే సంలచన విజయాన్ని అందకున్నారు. మహిళల క్రికెట్‌లో ఏ విభాగంలోనైనా టీమిండియాకు ఇదే తొలి ఐసీసీ టైటిల్ కావడం కావడం విశేషం. […]
పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు తన రెక్కలను మహిళా క్రికెట్ వరకు చాచింది. ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తూ.. వ్యాపార సంస్థకు కోట్లలో ఆదాయం తెచ్చిపెడుతూ.. బీసీసీఐకి బంగారు బాతుగా మారింది ఐపీఎల్. 2008లో మొదలై.. ఇప్పటికే 14 సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు పురుష క్రికెటర్లకు మాత్రమే పరిమితమైన ఈ ఐపీఎల్.. ఇప్పుడు మహిళల క్రికెట్‌లోకి కూడా ప్రవేశపెడుతోంది బీసీసీఐ. దీని కోసం బిడ్డింగ్‌లు ఆహ్వాంచింది. బుధవారం […]
అతడి ఆటకు ఫిదా కానీ క్రికెట్ అభిమాని లేడు. సొగసైన బ్యాటింగ్ తో టీమిండియాలోకి స్పీడ్ గా దూసుకొచ్చాడు. అయితే అంతే స్పీడ్ గా జట్టులోంచి వెళ్లిపోయాడు. ఇక అప్పటి నుంచి అతడిని బీసీసీఐతో పాటుగా, సెలెక్షన్ కమిటీ సైతం మర్చిపోయినట్లుగా ఉంది. అయితే తనను మర్చిపోయిన ప్రతీసారి తన బ్యాటింగ్ పవర్ తో గుర్తుచేస్తూనే వస్తున్నాడు టీమిండియా డాషింగ్ బ్యాటర్, చోటా వీరేంద్ర సెహ్వాగ్ పృథ్వీ షా. దేశవాలీ ట్రోఫీల్లో దుమ్మురేపుతున్నాడు. తాజాగా జరుగుతున్న రంజీ […]
క్రికెటర్లపై కాసుల వర్షం కురిపిస్తూ.. వ్యాపారులకు కోట్లు తెచ్చిపెడుతూ.. క్రికెట్ అభిమానులకు రెండున్నర నెలల పాటు వినోదాన్ని అందించే ఐపీఎల్‌కు అరుదైన ఘనత దక్కింది. ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఐపీఎల్‌కు స్థానం దక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2022 ఫైనల్ జరిగిన విషయం తెలిసిందే. గతేడాది మే 29న గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ను ఏకంగా 1,01,566 మంది […]
భారతదేశంలో క్రికెట్ కు ఉన్నంత క్రేజ్ మరే ఆటకు లేదనడంలో.. ఎలాంటి సందేహం లేదు. దాంతో తమ అభిమాన క్రికెటర్లకు సంబంధించిన చాలా విషయాలను తెలుసుకోవాలని ఆరాటం సగటు క్రికెట్ అభిమానికి ఉంటుంది. అందులో భాగంగానే ముఖ్యంగా క్రికెటర్లు ఒక్క మ్యాచ్ కు ఎంత మెుత్తం జీతంగా తీసుకుంటరో అన్న ప్రశ్న చాలా మంది మనసులో మెదులుతూ ఉంటుంది. దాంతో ఇంటర్ నెట్ లో తెగ సెర్చ్ చేస్తుంటారు క్రికెట్ అభిమానులు. అయితే ఈ క్రమంలోనే BCCI.. […]
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ బీసీసీఐపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషాపై పరోక్షంగా సెటైర్లు వేశాడు. భారత్‌లో క్రికెట్ పరిపాలనలో అనుభవంలేని స్పష్టం తెలుస్తోందని కామెంట్ చేశాడు. గత ఏడాది కాలంగా రెండు దేశాల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉన్న నేపథ్యంలో బీసీసీఐ పెద్దలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నాడు. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ సెక్రటరీ ఇలాంటి ప్రకటన […]
ప్రస్తుతం యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం ఆదివారం జరగబోయే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పైనే ఉంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తోనే ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం 90 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడైపోయాయి. అతి పెద్ద స్టేడియం అయిన మెల్‌బోర్న్‌లో ఈ క్రేజీ మ్యాచ్ జరగనుంది. కాగా.. ఈ […]