విరాట్ కోహ్లీ అలియాస్ పరుగులు యంత్రం.. క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ప్లేయర్లలో విరాట్ కోహ్లీ ఒకడని అందరికీ తెలిసిందే. కానీ, గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ ఫామ్ లేమితో ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. వంద పరుగుల కోసం దాదాపు 1000 రోజులుగా ఎదురుచూస్తున్నాడు. కొందరు కోహ్లీకి సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఫామ్ విషయంలో కోహ్లీకి విదేశీ క్రికెటర్ల నుంచి సర్వత్రా మద్దతు లభిస్తోంది.
ఇటీవలే పాక్ కెప్టెన్ బాబర్ అజాం కూడా కోహ్లీకి తన మద్దతు తెలియజేశాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సైతం కోహ్లీ ఫామ్ పై స్పందిస్తూ కోహ్లీకి సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. వీళ్లిద్దరే కాదు విదేశీ క్రికెటర్లు ఎంతో మంది కోహ్లీకి అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిదీ.. కోహ్లీ ఫామ్ విషయంలో కాకుండా.. అతని స్పందన విషయంలో స్పందించాడు.
This too shall pass. Stay strong. #ViratKohli pic.twitter.com/ozr7BFFgXt
— Babar Azam (@babarazam258) July 14, 2022
విషయం ఏంటంటే షాహిద్ అఫ్రిదీ ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ.. “కోహ్లీ విషయంలో బాబర్ అజాం ఎంతో అద్భుతంగా స్పందించాడు. అయితే కోహ్లీ బాబర్ ట్వీట్ పై స్పందించాడో లేదో నాకు తెలియదు. కానీ, విరాట్ తప్పకుండా బాబర్ ట్వీట్ స్పందించాలి. అనుబంధాలను పెంపొందించుకునేందు.. క్రికెట్ గానీ, ఏ ఇతర క్రీడ అయిన ఉపయోగపడుతుంది. కోహ్లీ స్పందిస్తే అది గొప్ప విషయమే అవుతుంది. కానీ, కోహ్లీ స్పందిస్తాడని నేను అనుకోవడం లేదు” అంటూ అఫ్రిదీ చెప్పుకొచ్చాడు.
Shahid Afridi – “Cricket has brought Pakistan and India closer. Babar Azam conveyed a very positive message to the world and I think Virat Kohli should’ve responded too. Relations were normal between the two countries but it got worse after Narendra Modi came in power.”
— Arfa Feroz Zake (@ArfaSays_) July 15, 2022
బాబర్ అజాం కోహ్లీకి మద్దతు పలకడాన్ని ఎంతో మంది ప్రశంసించారు. బాబర్ ట్వీట్ చేయడమే కాకుండా.. శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో సైతం బాబర్ స్పందించాడు. “ఓ ప్లేయర్ గా ఫామ్ కోల్పోవడం, ఫామ్ లేమితో ఇబ్బంది పడటం గురించి నాకు బాగా తెలుసు. ప్రతి ఆటగాడు ఆ దశను ఎదుర్కొంటాడు. అలాంటి సమయంలో అందరి సపోర్ట్ ఎంతో అవసరం. అందుకే నేను విరాట్ కు మద్దతుగా ట్వీట్ చేశాను. విరాట్ అత్యుత్తమ ప్లేయర్. తిరిగి విరాట్ ఫామ్ లోకి వస్తాడు. అది క్రికెట్ కు కూడా ఎంతో మంచిది” అంటూ బాబర్ చెప్పుకొచ్చాడు. విరాట్ స్పందించాల్సిందేనంటున్న అఫ్రిదీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🗣️ The more we back him, the better
Babar Azam doubles down on his support for Virat Kohli pic.twitter.com/xrN0rQidWB
— ESPNcricinfo (@ESPNcricinfo) July 15, 2022