భారత క్రికెట్ కు సంబంధించి అన్ని వ్యవహారాలను చూసుకునే సంస్థ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). ప్రస్తుతం ఈ బోర్డుకు అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ వ్యవహరిస్తుండగా, కార్యదర్శిగా జైషా ఉన్నారు. వీరి పదవీ కాలం సెప్టెంబర్ తో ముగుస్తుంది. ఈ క్రమంలో తాజాగా వారు సుప్రీంకోర్డును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ వివరాలేంటో చూద్దాం పదండి.. బీసీసీఐ తాజాగా సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది. తమ రాజ్యాంగంలోని కూలింగ్ ఆఫ్ పీరియడ్ ను తొలగిస్తూ చేసిన సవరణలను ఆమోదించాలని బీసీసీఐ గతంలో కోర్టును ఆశ్రయించింది. 2019లోనే దాఖలు చేసిన పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని తాజాగా బీసీసీఐ కోరింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు అంగీకారం తెలపడంతో వచ్చేవారం విచారణ జరగనుంది. The Board of Cricket Control for India ("BCCI") has sought urgent listing of its plea in the Supreme Court seeking permission to amend its Constitution. Read more: https://t.co/qnyxYBcGgn pic.twitter.com/quz0w9o2W5 — Live Law (@LiveLawIndia) July 15, 2022 గతంలో జస్టిస్ ఆర్ఎం. లోథా కమిటీ చేసిన సిఫారసుల ప్రకారం బీసీసీఐ లేదా రాష్ట్రాల క్రికెట్ సంఘాల్లో గరిష్టంగా ఆరేళ్లకు మించి పదవుల్లో ఉండరాదు. ఒకవేళ అలా కొనసాగాల్సి వస్తే కూలింగ్ పీరియడ్ అంటే మధ్యలో మూడేళ్ల విరామం ఉండాలన్న తప్పనిసరి నిబంధన ఉంది. ఈ నిబంధనను తొలగిస్తూ బీసీసీఐ 2019లో సవరణ చేసింది. దీంతో పాలక వర్గం సభ్యులు 6 సంవత్సరాలు దాటినా పదవిలో కొనసాగవచ్చు. బీసీసీఐ కూలింగ్ పిరయడ్ సవరణలకు గనుక సుప్రీంకోర్టు ఆమోదం తెలిపితే.. పదవీకాలం ముగిసినా.. ప్రస్తుత బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాలు మరి కొన్నాళ్లు తమ పదవుల్లో ఉండొచ్చు. ఒకవేళ గతంలో బీసీసీఐ చేసిన సవరణలు సుప్రీం కోర్టు ఆమోదించకపోతే గంగూలీ, జే షాలు తమ పదవులు కోల్పోవాల్సి ఉంటుంది. BCCI plea mentioned in SC related to amendment of its constitution Read @ANI Story | https://t.co/cuzzPMw1gY#BCCI #SupremeCourt #SouravGanguly pic.twitter.com/PRfaAHlZvR — ANI Digital (@ani_digital) July 15, 2022 2013 నుంచి జై షా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ లో అధికారిగా ఉన్నారు. గంగూలీ 2014 నుంచి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడిగా.. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: సిక్సర్ కారణంగా గాయపడిన చిన్నారి తండ్రికి రోహిత్ శర్మ ఫోన్! ఇదీ చదవండి: పసికూన కాదు.. న్యూజిలాండ్ ని వణికించిన ఐర్లాండ్! ఆఖరి ఓవర్లో..