ఐపీఎల్ 2022 ఫీవర్ ముగిసిందో లేదో.. టీమిండియా జూన్ 9న సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లో తలపడబోతోంది. ప్రస్తుతానికి అంతా ఐపీఎల్ గురించి మర్చిపోయిన సమయంలో.. మరోసారి ఐపీఎల్ 2022 సీజన్ వార్తల్లో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో రియాన్ పరాగ్- హర్షల్ పటేల్ మధ్య చిన్నపాటి గొడవ జరగడం అందరికీ తెలిసిందే. అయితే ఆ గొడవలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అంటూ కొన్నిరోజులు చర్చోపచర్చలు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు ఆ గొడవకు సంబంధించిన అసలు కారణం వెలుగులోకి వచ్చింది. అది కూడా స్వయంగా రియాన్ పరాగ్ వెల్లడించాడు. అసలు హర్షల్ తో గొడవ ఎందుకు జరిగింది? దానికి కారణం ఏంటో చూద్దాం.
ఐపీఎల్ 2022లో ఆర్సీబీ తో మ్యాచ్ లో రియాన్ పరాగ్ తన ఐపీఎల్ కెరీర్ లోనే తొలి అర్ధ శతకం(56*) నమోదు చేశాడు. ఆ రోజు మ్యాచ్ తర్వాత రియాన్ పరాగ్- హర్షల్ పటేల్– సిరాజ్ మధ్య కాస్త వాగ్వాదం జరగడం చూశాం. ఆ రోజు రియాన్ మైదానం నుంచి బయటకు వెళ్తుంటే సిరాజ్ ఓయ్ ఓయ్ అని కేకలు వేస్తూ వచ్చి ఏదో అంటాడు. ఆ తర్వాత ఇరు జట్ల ప్లేయర్లు వారిని విడదీస్తారు. అందులో హర్షల్ పటేల్ తప్పుందని కొందరు, రియాన్ తప్పుందని కొందరు చెప్పారు.
Harshal Patel Vs Riyan Parag Fight🤬😡#rcbvsrr #rrvsrcb #riyanparag #harshalpatel #harshalpatelriyanparag #harshalvsriyan #riyanvsharshal #rcb #royalchallengersbangalore #RajasthanRoyals pic.twitter.com/Z47NZuKqek
— Cric Hub (@Cric__Hub) April 26, 2022
వీడియో గేమ్ స్ట్రీమింగ్ సమయంలో హర్షల్ తో గొడవ గురించి అడగ్గా.. రియాన్ పరాగ్ తొలిసారి స్పందించాడు. ‘అసలు ఆ గొడవ ఎందుకు జరిగిందంటే.. 2021లో యూఏఈలో ఆర్సీబీతో మ్యాచ్ లో హర్షల్ నా వికెట్ తీశాడు. ఆ తర్వాత బయటకి పో అంటూ నాకు చేతితో సైగలు చేశాడు. అది నేను అప్పుడు చూడలేదు. హోటల్ కి వెళ్లి రీప్లే చూస్తున్న సమయంలో అది చూశాక.. అది నా మైండ్ లో ఉండిపోయింది’.
Some clarification by Riyan Parag about the “Twitter made Controversies” in his Rooter Stream today –
With Harshal and Siraj:- pic.twitter.com/xFPp5xurdE
— iThunder (@HiPrsm) June 4, 2022
‘నేను హర్షల్ బౌలింగ్ లో లాస్ట్ ఓవర్లో 18 పరుగులు చేశాక.. నేను కూడా హర్షల్ కు చెయ్యి చూపించాను. నేను తప్పుగా ఏం మాట్లాడలేదు, బూతులు తిట్టలేదు. అయితే నేను బయటకు వెళ్లే సమయంలో సిరాజ్ నన్ను ఓయ్.. ఓయ్ అంటూ కేకలు వేశాడు. నా దగ్గరికి వచ్చి “పిల్లాడివి.. పిల్లాడిలా ఉండు” అని కామెంట్ చేశాడు. పక్కనే హర్షల్ పటేల్ కూడా ఉన్నాడు. ఈలోగా ఇది చూసిన మా జట్టు సభ్యులు మమ్మల్ని విడదీసి పంపేశారు’ అంటూ రియాన్ పరాగ్ హర్షల్ తో అసలు గొడవ ఎందుకు జరిగిందో చెప్పుకొచ్చాడు. హర్షల్ పటేల్- రియాన్ పరాగ్ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
About the run out with Ashwin- pic.twitter.com/2w27vEwK9L
— iThunder (@HiPrsm) June 4, 2022