ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్ కి కోట్లు కుమ్మరించడం మన ఫ్రాంచైజీలకు అలవాటే. అలాంటి ఒక బంపర్ ఆఫర్ ఒకటి రాజస్థాన్ స్టార్ ప్లేయర్ బట్లర్ కి ఒకటి వచ్చింది. దీని ప్రకారం ఈ ఇంగ్లీష్ కెప్టెన్ కి భారీగానే అందనుందని సమాచారం.
స్టార్ ప్లేయర్ అయితే చాలు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించడానికి రెడీగా ఉంటారు. బాగా ఆడాలే గాని స్వదేశీ, విదేశీ అనే తేడా ఏమి ఉండదు. అయితే సహజంగా వేలంలో ఇలాంటివి జరగడం చూస్తూ ఉంటాము. ఇక జట్టు విజయాల్లో కొంత మంది స్టార్ ఆటగాళ్లను తమ వద్దే అట్టిపెట్టుకొని వారికి భారీగా ఆఫర్ చేస్తూ ఉంటారు మన ఐపీఎల్ ఫ్రాంచైజీలు. విరాట్ కోహ్లీ, ధోని, పంత్, రోహిత్ శర్మ లాంటి ఇండియన్ స్టార్లు ఈ జాబితాలోకి వస్తారు. అయితే తొలిసారి ఒక విదేశీ స్టార్ ప్లేయర్ మీద ఐపీఎల్ ఫ్రాంచైజీ భారీగా ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. అతడెవరో కాదు ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జాస్ బట్లర్. తాజా సమాచార ప్రకారం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఈ ఆటగాడికి 40 కోట్లు ఆఫర్ చేసారంట.
ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టు 2008 లో టైటిల్ విన్నర్ గా నిలిచింది. తొలి సీజన్ లో అంచనాలు లేకుండా వచ్చి ఏకంగా టైటిల్ ఎగరేసుకుపోయింది. అయితే ఆ తర్వాత ఆశించిన ప్రదర్శన చేయలేదనే చెప్పాలి. దీంతో క్రమంగా ఆ జట్టు టైటిల్ గెలుస్తుంది అనే భావన అందరిలో పోయింది. అయితే జోస్ బట్లర్ రూపంలో ఆ జట్టుకి ఒక స్టార్ ప్లేయర్ దొరికాడు. బట్లర్ వచ్చినప్పటినుండి రాజస్థాన్ జట్టు స్టార్ టీంలలో ఒకటిగా నిలిచింది. అంతే కాదు గతేడాది ఈ విధ్వంసకర ఓపెనర్ రాజస్థాన్ జట్టుని ఒంటి చేత్తో ఫైనల్ కి చేర్చాడు. 2018 నుంచి రాజస్తాన్ రాయల్స్ కు ఆడుతున్న బట్లర్..ఇప్పటివరకు 96 మ్యాచ్‌లలో 37.92 సగటుతో 3,223 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలున్నాయి. ఈ మేరకు బట్లర్ ని మరో నాలుగేళ్లు తమతోనే ఉంచుకుంనేందుకు రాజస్థాన్ దాదాపు 40 కోట్లు ఇచ్చినట్లుగా తెలుస్తుంది.
ఇంత భారీ ఆఫర్ రాగానే బట్లర్ సందిగ్ధంలో పడినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం బట్లర్ ఇంగ్లాండ్ కి పరిమిత ఓవర్ల కెప్టెన్. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నుంచి ఈ స్టార్ ప్లేయర్ కి భారీగానే అందుతుంది. అయితే రాజస్తాన్.. బట్లర్ లీగ్ లలో భాగమైతే చాలని, ఈసీబీ కాంట్రాక్టును పూర్తిగా కోల్పోవాల్సిన పన్లేదని రాజస్తాన్ రాయల్స్ ప్రతినిధులు నుంచి సమాచారం. ప్రస్తుతానికి ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తో పాటు దక్షిణాఫ్రికాలో జరిగే ఎస్‌ఎ 20 లో రాజస్తాన్ టీమ్ పార్ల్ రాయల్స్ కు కూడా బట్లర్ ఆడుతున్నాడు. భవిష్యత్తులో టీ 20లీగ్ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని బట్లర్ కి ఇంత భారీ మొత్తం ఆఫర్ చేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.