కొంతమందికి అవకాశాలు రాక తమ టాలెంట్ మరుగున పడిపోతే మరికొందరు వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటారు. ఒకప్పుడు పేదరికంలో బ్రతికిన ఆ క్రికెటర్ ప్రస్తుతం ముంబైలో ఒక పెద్ద ఇల్లు కొన్నాడు. ఇదంతా ఐపీఎల్ వలనే సాధ్యమైందని ఎమోషనల్ అయ్యాడు.
టాలెంట్ ఉండాలే కానీ డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదు. ఒక్కసారి మన కష్టానికి ప్రతిఫలం వస్తే ఆ సమయంలో మన ఎమోషన్స్ ఎంత కంట్రోల్ చేసుకున్న ఆగవు. కొంతమందికి అవకాశాలు రాక తమ టాలెంట్ మరుగున పడిపోతే మరికొందరు వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటారు. అలాంటివారిలో ఐపీఎల్ సూపర్ స్టార్ ముంబై ప్లేయర్ యశస్వి జైస్వాల్ ఖచ్చితంగా ఉంటాడు. జైస్వాల్ క్రికెటర్‌గా మారే క్రమలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. బాగా పేదరికం ఉండడం వలన తండ్రికి సాయంగా పానీపూరీ అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి క్రికెటర్ ఇప్పుడు కోట్లు పెట్టి ముంబైలో ఒక పెద్ద ఇల్లు కొన్నాడు. దీంతో తన సొంతింటి కల నిజం కావడంతో జైస్వాల్ ఎమోషనల్ అయ్యాడు.
జైస్వాల్ మంచి ప్రతిభ ఉన్న క్రికెటర్ అయినా.. అతనికి గుర్తింపు తీసుకొని వచ్చింది మాత్రం ఐపీఎల్ 2023 సీజన్ అని చెప్పుకోవాలి. అండర్ -19 వరల్డ్ ద్వారా తొలి సారి తానేంటో నిరూపించుకున్నాడు ఈ ముంబై బ్యాటర్. ఆ టోర్నీలో పరుగుల వరద పారించి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. 2020 లో రాజస్థాన్ రాయల్స్ యశస్వీని రూ.2.40 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో బాగా ఆడడంతో ఈ యంగ్‌స్టర్‌ను 2022లో రాజస్థాన్ యాజమాన్యం రూ.4 కోట్ల భారీ ధరకు రెటైన్ చేసుకుంది. ఇక ఈ ఐపీఎల్ లో జైస్వాల్ ఎలా ఆడాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సెంచరీ 5 అర్ధ శతకాలతో ఆరు వందలకు పైగా పరుగులు చేసాడు. ఈ ప్రదర్శన ఆధారంగానే విండీస్ తో జరగబోయే టెస్టు సిరీస్ కి తొలిసారి జట్టులో స్థానం సంపాదించాడు.
ఇదిలా ఉండగా.. తాజాగా ముంబై లో ఒక పెద్ద ఇల్లు కొన్న జైశ్వాల్.. తన కష్టాలను గూర్చి చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ లో ఆడే అవకాశం దక్కినప్పుడు ముంబైలో ఎలాగైనా మంచి ఇల్లు కొనాలని భావించాను. ఎందుకంటే.. సొంతిల్లు లేక నా ఫ్యామిలీ ముంబైలో చాలా చోట్ల గడిపాము. మంచి ఇల్లు కొని.. అందులోమా అమ్మానాన్న, తోబుట్టువులతో హాయింగా జీవించాలని అనుకున్నా. నేను అనుకున్న కళ ఫలించింది. నా జీవితానికి ఇంతకన్నా ఇంకేమి కావాలి. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్లాన్ చేసుకుంటున్నా” అని యశస్వీ తెలిపాడు. మరి జైస్వాల్ ఎమోషనల్ స్టోరీ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.