అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా దేశవ్యాప్తంగా అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప రిలీజ్ అయిన అన్ని ప్రాంతాల్లోకలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ సినిమాలోని పాటలు, డైలాగ్‌లు, అల్లు అర్జున్ మ్యానరిజం బాగా పాపులర్ అయ్యాయి. స్టార్ క్రికెట్ స్టార్లు సైతం పుష్ప మానియాతో ఊగిపోయారు. లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచులో చండిమల్‌ను.. ఇషాన్ కిషన్ స్టంప్ ఔట్ చేయగానే.. జడేజా తన చేతితో గడ్డాన్ని నిమురుతూ తగ్గేదే లే (మై జూకేకా నహీ) అంటూ సంబరాలు చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పుష్ప సినిమా విడుదలై రెండు నెలలు కావొస్తున్నప్పటికీ.. ఆ క్రేజ్ ఇంకా తగ్గడం లేదు. పుష్పరాజ్ క్యారెక్టర్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రికెటర్లలోకి బాగా దూసుకెళ్లిపోయాడు. అంతర్జాతీయ క్రికెటర్లు ఇప్పటికే చాలామంది ‘పుష్ప’ సినిమాలోని డ్యాన్సులు, డైలాగులతో అదరగొడుతున్నారు. శ్రీలంకతో తొలి టీ20 ద్వారా పునరాగమనం చేసిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో పెద్దగా అవకాశం రానప్పటికి.. బౌలింగ్‌లో తన మార్క్‌ను చూపించాడు. 4 ఓవర్లు వేసిన జడేజా 28 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. శ్రీలంక వికెట్ కీపర్ చండిమల్‌ను ఔట్ చేసిన జడేజా పుష్పరాజ్ తరహాలో ‘తగ్గేదేలే’ అన్నట్లుగా సంజ్ఞ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇప్పటికే.. ‘సర్’ అనే బిరుదును ప్రెసెంట్ చేసిన అభిమానులు.. దానికి కాస్తా పుష్పరాజ్ ను కలిపి.. ‘సర్ పుష్పరాజ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి