ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రసకందాయకంగా మారింది. ఇరు జట్ల బౌలర్లు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీశాడు టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. దాంతో దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు ఈ మిస్టరీ స్పిన్నర్.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసిస్ తో జరుగున్న మూడో టెస్టు రసవత్తరంగా మారింది. ఇక తన తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా ఆస్ట్రేలియాను సైతం తక్కువ పరుగులకే కట్టడి చేసింది.197 పరుగులకే ఆసిస్ ఇన్నింగ్స్ ను ముగించేశారు భారత బౌలర్లు. ఇక ఈ ఇన్నింగ్స్ లో భారత సీనియర్ బౌలర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లతో రాణించాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును సైతం అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆసిస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా రాణించాడు. తొలి రోజు వికెట్స్ ఏమీ తీసుకోక పోయిన అశ్విన్.. రెండో రోజు బంతిని ఆలస్యంగా అందుకున్నాడు. అయినప్పటికీ తన అనుభవాన్ని అంతా రంగరించి వరుస ఓవర్లలో 3 వికెట్లు తీసి ఆసిస్ నడ్డి విరిచాడు ఈ మిస్టరీ స్పిన్నర్. ఇక ఈ మ్యాచ్ లో ఆసిస్ బ్యాటర్ అలెక్స్ క్యారీని పెవిలియన్ కు చేర్చడం ద్వారా ఓ అరుదైన ఘనతను సాధించాడు అశ్విన్.ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు అశ్విన్. భారత్ తరపున అత్యధిక అంతర్జాతీయ వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో 689 వికెట్లతో మూడో స్థానానికి దూసుకొచ్చాడు అశ్విన్.
ఈ క్రమంలోనే 687 వికెట్లు తీసిన కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు స్టార్ స్పిన్నర్. ఇక ఈ జాబితాలో 953 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు దిగ్గజ బౌలర్ అనిల్ కుబ్లే. ఆ తర్వాత స్థానంలో 707 వికెట్లతో టర్బోనేటర్ హర్భజన్ సింగ్ ఉన్నాడు. ఇక ఇప్పటికే అశ్విన్ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆసిస్ 197 పరుగులకు కుప్పకూలింది. ప్రస్తుతం భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో తడబడుతూ బ్యాటింగ్ కొనసాగిస్తోంది.ప్రస్తుతం భారత్ 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి 4 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్ లో చతేశ్వర్ పుజారా (43), శ్రేయస్ అయ్యర్ (10) పరుగులతో ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మరి అశ్విన్, కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ashwin is now among the top 3 most prolific wicket-takers for India pic.twitter.com/G09kkOqcjR
— ESPNcricinfo (@ESPNcricinfo) March 2, 2023