టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి సర్జరీ కారణంగా టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. జడేజా లేకపోవడం టీమిండియాకు పెద్ద సమస్యే. అతనికి తోడు జస్ప్రీత్ బుమ్రా సైతం వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. ఇలా ఇద్దరు స్టార్లు దూరమైన టైమ్‌లో.. జడేజా దేశవాళీ టోర్నీలో ఆడుతున్నట్లు ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాకు ఎంతో కీలకమైన ప్లేయర్ ఇలా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడేంటి? అనే అనుమానం కలిగింది.. ఆ ఫొటో చూసిన వారందరికి. కానీ.. అందులో ఉంది నిజంగా రవీంద్ర జడేజా కాదు. అతనిలానే కనిపించే సౌరాష్ట్ర యువ క్రికెటర్ ప్రేరక్ మన్కడ్. చూడటానికి అచ్చం జడేజాలా కనిపించే ఈ ఆటగాడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ టాపిక్‌గా మారిపోయాడు.
ఇరానీ కప్‌లో భాగంగా సౌరాష్ట్ర, రెస్టాఫ్ ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్‌తో కలిసి మన్కడ్ భారీ భాగస్వామ్య నమోదు చేశాడు. ఈ క్రమంలో అతను కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. ఇద్దరి మధ్య మంచి పార్ట్‌నర్ షిప్ రావడంతో మ్యాచ్ తర్వాత ఉనద్కట్ తనతో పాటు మన్కడ్ ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. జడ్డూ జట్టులో ఉండటం సంతోషంగా ఉంది అంటూ పేర్కొన్నాడు. ఆ ఫొటోలో మన్కడ్ నిజంగానే జడేజాలానే కనిపిస్తున్నాడు. దీంతో ఆ ఫొటో వైరల్‌గా మారింది. ఎలాగో టీ20 వరల్డ్ కప్ జడేజా దూరం అయ్యాడు కనుక అతని స్థానంలో ఈ జూనియర్ జడేజాను పంపిస్తే సరిపోతుందని నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఉనద్కట్, ప్రేరక్ మన్కడ్, షెల్డన్ జాక్సన్, అర్పిత్ వాసవాడ హాఫ్ సెంచరీలతో రాణించడంతో 380 పరుగులు చేసింది. ప్రేరక్ మన్కడ్ 83 బంతుల్లో 9 ఫోర్లుతో 72 పరుగులు చేసి రాణించాడు. ఇక రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసి గెలుపొందింది. రెస్టాఫ్ ఇండియా ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ 63 పరుగులతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్ 138 పరుగులతో అదరగొట్టిన విషయం తెలిసిందే.
Glad to have Jaddu in the team.. (in disguise 😂) @imjadeja = @PrerakMankad46 pic.twitter.com/3URrzEMgD2
— Jaydev Unadkat (@JUnadkat) October 3, 2022
ఇది కూడా చదవండి: పిల్లలు చనిపోవడంపై రషీద్ ఖాన్ ఎమోషనల్! కన్నీటితో పోస్ట్!