ప్రస్తుత క్రికెట్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పసికూన అనే ట్యాగ్ తో ఆటలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. పెద్ద జట్లనే ఓడించే స్థాయికి ఎదిగింది. అఫ్ఘన్ జట్టు ఈ స్థాయికి చేరడానికి పలువురు క్రికెటర్లు అద్భుత ప్రదర్శనలే కారణం. తమ దేశంలో సరైన సదుపాయాలు లేనప్పటికీ పగలు రాత్రి కష్టపడి, ఆటపై మక్కువ చూపించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తమ దేశానికి ఫేమ్ వచ్చేలా చేశారు. అలాంటి ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితులు రోజురోజుకీ ఘోరంగా తయారవుతున్నాయి. ఈ క్రమంలోనే స్పిన్నర్ రషీద్ ఖాన్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కొన్నాళ్ల క్రితం అఫ్ఘానిస్థాన్, తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. దేశ రాజధాని కాబూల్ లో గత శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో అభం శుభం తెలియని విద్యార్థులు చనిపోగా, పలువురు గాయపడ్డారు. స్టూడెంట్స్, పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో ఓ ఆగంతకుడు బాంబు ధరించి క్లాస్ రూంకి వెళ్లాడు. విద్యార్థుల మధ్య కూర్చుని తనని తాను పేల్చుకున్నట్లు తెలిసింది. ఈ ఆత్మాహుతి దాడిలో 46 మంది బాలికలతో పాటు ఓ మహిళ మరణించినట్లు ఐక్యరాజ్యసమితి ధ్రువకరించింది.
ఇక ఆ తర్వాత మరణించిన వారి సంఖ్య 53కు, గాయపడిన వారి సంఖ్య 110కి చేరిందని ఐరాస ట్వీట్ చేసింది. కాగా కాబుల్ ఆత్మాహుతి దాడిపై ఆ దేశ క్రికెటర్లు రషీద్, రహ్మత్ షాలు స్పందించారు. ‘దయచేసి చదువును చంపేయకండి. ఏమి తెలియని పిల్లలేం చేశారు. వారిని ఎందుకు పొట్టనబెట్టుకున్నారు. ఇది చాలా బాధకలిగిస్తోంది.’ అని పేర్కొన్నారు. ఇక కాబుల్ లోని ఆసుపత్రి ఐసీయూ బయట తన సోదరి స్కూల్ బ్యాగ్ తో కూర్చున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి రషీద్ ఖాన్ ట్వీట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Kabul 💔💔 😢😢🤲🏻🤲🏻 #DontKillEducation 🙏🙏 pic.twitter.com/mxmRFsswmc
— Rashid Khan (@rashidkhan_19) September 30, 2022
💔💔💔😭😭😭🤲🏻🤲🏻🤲🏻…. pic.twitter.com/tqDGtAVbIv
— Rahmat Shah (@RahmatShah_08) October 1, 2022