పాకిస్తాన్ కు చెందిన నేతలు, అధికారులు, క్రికెటర్లు.. వ్యక్తులు ఎవరైనా ఏదొక సందర్భంలో భారత్ ను తల్చుకోనిదే వారికి పూట గడవదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ రమీజ్ రాజా మరోసారి ఆ విషయాన్ని రుజువు చేశాడు. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా ఇండియాపై తమ అక్కసు వెళ్లగక్కడమే వారి లక్ష్యం. లేదంటే శ్రీలంక మీద మ్యాచ్ గెలిస్తే భారత్ పై గెలుపును గుర్తు చేసుకుంటూ వ్యాఖ్యలు చేశాడు.
విషయం ఏంటంటే.. పాకిస్తాన్ జట్టు 2 టెస్టుల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తోంది. ఈ సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 222 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ 218 పరుగులకే కుప్ప కూలింది. రెండో ఇన్నింగ్స్ లో లంక 337 పరుగులు చేసింది. 341 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బాబర్ అజామ్(119, 55)తో ఆకట్టుకోగా, షఫీఖ్ 160 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
Defiant in the final innings 👊
Pakistan made their 4⃣th highest fourth-innings total in the first Test in Galle 👏#SLvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/WntptqDOxu
— Pakistan Cricket (@TheRealPCB) July 20, 2022
ఈ విజయంపై స్పందించిన రమీజ్ రాజా “పాక్ టెస్టు చరిత్రలో శ్రీలంకపై విజయం అత్యుత్తమం అని చెప్పాలి. వాతావరణం ఎంత కఠినంగా ఉన్నా పాక్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించారు. గాలెలో శ్రీలంకలో పాకిస్తాన్ సాధించిన విజయం.. బెంగళూరులో భారత్ పై సాధించిన గెలుపుతో సమానం. పాక్ జట్టు ఆటగాళ్లు అంతా ఎంతో బాధ్యతాయుతంగా ఆడుతున్నారు” అంటూ వ్యాఖ్యానించాడు.
What a Incredible Win Today 🇵🇰 Outstanding performance by @imabd28 👏🏼 Great Team work✨Congratulations babar and team Good luck for the Next One!#PAKvsSL #Pakistan pic.twitter.com/sVUk8Q2nd9
— Saeed Ajmal (@REALsaeedajmal) July 20, 2022
1987లో బెంగళూరులో జరిగిన టెస్టు సిరీస్‌ను పాక్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో 221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 204 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తద్వారా 16 పరుగుల తేడాతో పాక్ ఆ మ్యాచ్ లో విజయం సాధించడమే కాకుండా.. సిరీస్ ను కైవసం చేసుకుంది. లంకపై విజయాన్ని బెంగళూరు మ్యాచ్ తో పోల్చడంపై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రమీజ్ రాజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
“At Par With Victory Over India In Bangalore”: PCB Chief Ramiz Raja On Pakistan’s Win Over Sri Lanka In 1st Test pic.twitter.com/42XzBTQWBQ
— Abdul Raheem (@Iam_Raheem0) July 23, 2022