పాకిస్థాన్ సారథి బాబర్ ఆజమ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. బాబర్‌ను అలా ఎలా అంటావంటూ అక్తర్‌పై పాక్ మాజీ క్రికెటర్లు సహా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే..!
ఆస్ట్రేలియాను రెండు వరుస టెస్టుల్లో ఓడించిన తర్వాత భారత క్రికెట్ జట్టుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ప్రశంసల వర్షం కురింపించాడు. టీమిండియా ఓడించడం అసాధ్యం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సాధారణంగా ఏ ఒక్క మ్యాచ్ తోనో, ఏ ఒక్క సిరీస్ తోనో ఆటగాడి సామర్థ్యాన్ని గుర్తించడం తగదు. ఒక్క మ్యాచ్ లో అతడు విఫలం అయినంత మాత్రాన.. అతడు తక్కువ స్థాయి ఆటగాడు అని నిర్థారణకు రాకుడదు. గతంలో ఇలాంటి నిర్ధారణకే వచ్చాడు మాజీ పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా. కొన్ని మ్యాచ్ లు విఫలం అయిన సర్ఫరాజ్ అహ్మద్ పై ఆటగాడిగా నీ కెరీర్ ముగిసిపోయింది అని అన్నాడు. ఆ వ్యాఖ్యలను అలాగే మనసులో పెట్టుకున్నాడు […]
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా పదవి పోయిన తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నాడు. తనను పదవి నుంచి తొలగించిన తర్వాత పాక్ బోర్డు ఖర్చులపై వివిధ ఆరోపణలు చేసిన రాజా.. తాజాగా పాకిస్థాన్ టీమ్ ఎదుగుల గురించి మాట్లాడుతూ.. భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘పాకిస్థాన్ ముందుకెళ్లడాన్ని చూసి ఇండియా జీర్ణించుకోలేకపోయింది’ అంటూ అర్థంలేని వ్యాఖ్యలు చేశాడు. తన హయాంలో పాకిస్థాన్ క్రికెట్‌ను ఎంతో ముందుకు తీసుకెళ్లినట్లు గొప్పలు […]
గత కొంత కాలంగా పాకిస్థాన్ క్రికెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ కు, జట్టులో ఆటగాళ్లకు.. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ అజమ్ కు మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో సమస్యలు తలెత్తుతున్నట్లు అక్కడి వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో పాక్ ఘోరంగా ఓటమి చెందింది. దాంతో పాకిస్థాన్ అభిమానులు ఇటు బోర్డ్ పైనా, అటు పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ పైనా ఆగ్రహంగా ఉన్నారు. ఇన్ని […]
టీమిండియాపై సందర్భం ఉన్నా.. లేకున్నా అక్కసు వెళ్లగక్కే పాక్ ఆటగాళ్లలలో ముందుంటాడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ రమీజ్ రజా. ఇప్పుడు అతడిపై పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు, ప్రస్తుత ప్లేయర్స్, పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. దానికి కారణం ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో పాక్ దారుణంగా ఓడిపోవడమే. మూడు టెస్టుల సిరీస్ లో 2-0తో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పీసీబీ […]
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ ఆసక్తి చూపిస్తారు. ఈ దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్ అలాంటిది మరీ. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా.. ప్రపంచం మొత్తం క్రికెట్ మొత్తం క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతుంది. అయితే.. కొన్నేళ్లుగా ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. పాకిస్థాన్‌లో క్రికెటర్లపై బాంబు దాడి, ఇండియాలో ఉగ్రవాదుల బాంబు పేలుళ్ల నేపథ్యంలో భారత జట్టు పాకిస్థాన్ వెళ్లి క్రికెట్ […]
టెస్టు క్రికెట్‌ను ఇంగ్లండ్ టీమ్ ఆడుతున్న విధానంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దాదాపు 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. రావాల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఫ్లాట్ పిచ్‌పై చెలరేగి ఆడింది. వన్డే, టీ20 ఆడుతున్నట్లు.. ఇంగ్లండ్ బ్యాటర్లు పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. […]
‘భారత్- పాకిస్తాన్‘ ఈ ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ఉండే కిక్కే వేరు. ఇరుదేశాల అభిమానులతో పాటు యావత్ ప్రపంచం దృష్టంతా ఆ మ్యాచ్ వైపే ఉంటుంది. ఇక క్రికెట్ ప్రేమికులైతే.. ఆరోజు టీవీలకు అతుక్కుపోయి ఉంటారు. అయితే.. సరిహద్దు వివాదాలు, దౌత్య కారణాల కారణంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు జరగటం కనుమరుగైపోయింది. ఏదో అడపాదడపా ఐసీసీ టోర్నీల్లో తలపడతున్నా.. అవి అభిమానులకు సరిపొవట్లేవు. ఇదిలావుంచితే.. ఇకపై ఈ ఇరు జట్ల ప్రతిష్టాత్మక టోర్నీల్లో […]
ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టింది. బాంబు దాడుల భయంతో పాకిస్థాన్ వెళ్లేందుకు కొన్నేళ్లుగా అన్ని క్రికెట్ టీమ్స్ వణికిపోతున్న విషయం తెలిసిందే. అయితే.. పాక్ క్రికెట్ బోర్డు కాళ్లావేళ్లా పడటంతో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు.. గతేడాది పాక్ పర్యటనకు వచ్చింది. కానీ.. మ్యాచ్ ఆరంభానికి కొన్ని నిమిషాల ముందే భద్రతా కారణాల దృష్ట్యా, సిరీస్ రద్దు చేసుకుని స్వదేశానికి వెళ్లిపోయింది. […]