సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా-2022 సిరీస్ 2-2తో సమం అయ్యింది. నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్ వరుణుడి దెబ్బకు రద్దుకాక తప్పలేదు. 2010 తర్వాత ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా జట్టు భారత్ లో ఒక్క లిమిటెడ్ ఓవర్స్ సిరీస్ ని ఓడిపోలేదు. ఆ రికార్డును బ్రేక్ చేద్దామని ఎదురుచూసిన టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఇంక సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లు ఓడిన టీమిండియా ఆ తర్వాత వరుస మ్యాచుల్లో విజయాలతో సత్తా చాటింది. అయితే ఆ రెండు మ్యాచులు గెలిచినా కూడా.. కెప్టెన్ రిషబ్ పంత్ పై విమర్శలు మాత్రం ఆగడం లేదు. కెప్టెన్ గా నిర్ణయాలు, బ్యాటింగ్, కీపింగ్ ఇలా అతనిపై ఏదొక విషయంలో మాజీలు, నిపుణులు, స్టార్ క్రికెటర్స్ పెదవి విరుస్తూనే ఉన్నారు.
పంత్ అనవసరపు షాట్లతో వికెట్ సమర్పించుకుంటున్నాడని, షాట్ల ఎంపికలోనే అతను తప్పు చేస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా రిషబ్ పంత్ ఫిట్‌నెస్ విషయంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కాస్త ఘాటుగానే స్పందించాడు. పంత్ ఫిట్ నెస్ గురించి మాట్లాడుతూ.. ‘పంత్ ఒబేసిటీతో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. అతను స్థూలకాయంతో బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పంత్ తన బ్యాటింగ్ శైలిని మెరుగుపరుచుకోవాల్సి ఉంది. తన ఫిట్‌నెస్ లెవల్స్ పెంచుకోకపోతే.. కచ్చితంగా అతని స్థానాన్ని కోల్పోయే పరిస్థితి ఎదురౌతుంది.’
Danish Kaneria Feels Rishabh Pant Is Overweight!#Cricket #INDvSA #IndianCricket #TeamIndia #RishabhPant pic.twitter.com/1xrley0XVu
— CRICKETNMORE (@cricketnmore) June 19, 2022
‘బ్యాటింగ్ గురించే కాదు.. అతను వికెట్ కీపర్ గా కూడా పెద్దగా రాణిస్తున్నాడని నేను అనుకోవట్లేదు. అతను పేస్ బౌలింగ్ సమయంలోనూ నిల్చునే ఉంటున్నాడు. వంగడం లేదు.. అలాగని మోకాళ్ల మీద కూడా ఉండట్లేదు. ఒబేసిటీ కారణంగానే.. అతను ఇలా నిల్చుని కీపింగ్ చేస్తున్నాడు. అయినా కేఎస్ భరత్, వృద్ధిమాన్ సాహా అందుబాటులో ఉన్న టైమ్ లో పంత్ కు విశ్రాంతి ఇవ్వడం ఎంతో అవసరం’ అంటూ డానిష్ కనేరియా పంత్ ప్రదర్శనపై ఘాటుగా స్పందించాడు.
Danish Kaneria has doubts on Rishabh Pant’s fitness.#RishabhPant #INDvSA pic.twitter.com/8372ETPo7L
— Fantasy Sports King (@FantasySportsK1) June 19, 2022
సౌత్ ఆఫ్రికా- టీమిండియా సిరీస్ లో పంత్ ప్రదర్శన విషయానికి వస్తే.. మొదటి నాలుగు మ్యాచుల్లో పంత్ కేవలం 57 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆఖరి మ్యాచ్ లో పంత్ 1 బంతికి 1 పరుగు చేసిన స్థితిలో మ్యాచ్ రద్దు అయ్యింది. అయితే పంత్ బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీపై చాలా మంది ఘాటుగానే స్పందించారు. మరి పంత్ ఆ విమర్శల నుంచి పాఠాలు నేర్చుకుంటాడా? లేక అదే ధోరణి కొనసాగిస్తాడా? వేచిచూడాల్సి ఉంది. పంత్ ఫిట్‌నెస్‌పై డానిష్ కనేరియా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sunil Gavaskar on Rishabh Pant – “He has got to think about his batting now” #INDvSA #RishabhPant #TeamIndia pic.twitter.com/qFZLLDMlpS
— Cricket Addictor (@AddictorCricket) June 15, 2022