మన సమాజంలో ఆడవారిపై అఘాయిత్యాలకు తావులేని రంగం, ప్రాంతం లేదంటే అతశయోక్తి కాదు. ఇంట్లో, పని చేసే చోట, చదువుకునే చోట ఇలా ప్రతి దగ్గర మహిళలపై లైంగిక వేధింపులు నిత్యకృత్యం అయ్యాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. కఠినంగా శిక్షించినా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఈ దారుణాలకు పాల్పడే వారిలో సామన్యులే కాక.. సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా మహిళా క్రికెటర్‌పై ఓ మాజీ ప్లేయర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పాకిస్తాన్ క్రికెటర్ ఒకరు మహిళా ప్లేయర్‌పై లైంగిక దాడి చేయడమే కాక.. వీడియోలు తీసి.. వాటితో ఆమెని బెదిరించడమే కాక స్నేహితులతో కలిసి వేధించడం ప్రారంభించాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగు చూసింది. ఆ వివరాలు.. గత కొన్ని రోజులుగా పాక్ క్రికెట్ బోర్డ్ పరిస్థితి ఏం బాగాలేదు. వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. మొన్నటి వరకు పీఎస్ఎల్లో ఆడినందకు తనకు రావాల్సిన డబ్బును ఇవ్వలేదంటూ ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్క్ నర్ రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇక కొన్ని రోజుల క్రితం పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది.. తనను మతం పేరుతో దూషించాడని.. అదే దేశానికి చెందిన మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆరోపణలు చేశాడు. ఇక వీటి గురించి మరువక ముందే పాకిస్తాన్ క్రికెట్‌ను ప్రస్తుతం లైంగిక ఆరోపణలు కుదిపేశాయి. ఇది కూడా చదవండి: Neeraj Chopra: ఒలంపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రాకు తృటిలో తప్పిన పెను ప్రమాదం! పాకిస్తాన్‌కు చెందిన మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్.. కోచ్ నదీమ్ ఇక్బాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ముల్తాన్‌కు చెందిన ఓ మహిళా క్రికెటర్‌కు జట్టులో చోటు కల్పిస్తానంటూ హామీ ఇచ్చి ఆపై లైంగికంగా ఆమెను వేధించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు(పీసీబీ) ఫిర్యాదు అందింది. దాంతో రంగంలోకి దిగిన పీసీబీ సదరు కోచ్‌ను సస్పెండ్ చేసి విచారణ చేపట్టింది. నదీమ్ తప్పు చేశాడని తేలితే అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పీసీబీ స్పష్టం చేసింది ప్రస్తుతం నదీమ్ పోలీసుల కస్టడీలో ఉన్నట్లు సమాచారం. ’కొన్నేళ్ల క్రితం పాకిస్తాన్ మహిళల జాతీయ జట్టు కోసం నిర్వహించిన ట్రయల్స్‌లో పాల్గొన్నాను. అప్పుడే కోచ్ నదీమ్ ఇక్బాల్ పరిచయం అయ్యాడు. పాకిస్తాన్ మహిళా జట్టులో చోటు కల్పిస్తానని నన్ను నమ్మించాడు. ఆ తర్వాత నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఊరుకోక స్నేహితులతో కలిసి నన్ను శారీరకంగా వేధించాడు. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ నన్ను బెదిరించాడు‘ అంటూ బాధిత మహిళా క్రికెటర్ తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై క్రికెట్ బోర్డు విచారణ చేపట్టింది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Dinesh Karthik: తగ్గదేలే అంటున్న దినేష్ కార్తీక్.. ధోనీ రికార్డులు బద్దలు కొట్టేశాడు!