గతేడాది జరిగిన ఒలింపక్ క్రీడల్లో జావెలిన్ త్రో విభాగంలో భారత్ తరఫున పాల్గొనడమే కాక.. స్వర్ణం సాధించి.. అంతర్జాతీయ వేదిక మీద త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు నీరజ్ చోప్రా. దాంతో దేశవ్యాప్తంగా స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస టోర్నీల్లో పాల్గొంటూ.. బిజీగా ఉన్నాడు నీరజ్ చోప్రా. ఈ క్రమంలో తాజాగా ఓ టోర్నీలో పాల్గొన్న నీరజ్ చోప్రా తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు.. ఫిన్‌లాండ్‌లో శనివారం జరిగిన కూర్తానె గేమ్స్‌లో నీరజ్ జావెలిన్‌ను 86.69 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే నీరజ్ చోప్రా ఈ గేమ్‌లో జావెలిన్ త్రోయింగ్ ప్రయత్నాల్లో రెండుసార్లు ఫౌల్ చేశాడు. ఈ క్రమంలోనే జావెలిన్ త్రో విసరగానే పట్టు తప్పిన నీరజ్ జారి కిందపడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ నీరజ్‌కు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. కిందపడిన నీరజ్ పైకిలేచి తాను బాగానే ఉన్నానంటూ చిరునవ్వుతో సంకేతాలు ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: Viral Video: గల్లీ క్రికెట్ ను తలపించిన నెదర్లాండ్స్- ఇంగ్లాండ్ మ్యాచ్! కాగా అంతకముందే భారీ వర్షం పడడంతో గ్రౌండ్ మొత్తం బురదమయమయింది. వర్షం ముగిసిన వెంటనే ఆటను ప్రారంభించారు. ఆటలో మొదటగా నీరజ్ చోప్రానే జావెలిన్ త్రో విసిరాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఇది ఆయనకు రెండో పోటీ. ఇక్కడ విజయం సాధించిన నీరజ్ అథ్లెటిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. నీరజ్ తర్వాత వాల్‌కాట్ 86.64 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచాడు. పీటర్స్ 84.75 ఉత్తమ ప్రయత్నంతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ పోటీలో పాల్గొనే సమయంలో నీరజ్ చోప్రా ప్రమాదం నుంచి తప్పించున్నాడు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Nasty slip for Neeraj Chopra on a very slippery runway at the Kuortane Games. He seems ok though. pic.twitter.com/6Zm0nlojkZ — jonathan selvaraj (@jon_selvaraj) June 18, 2022 ఇది కూడా చదవండి: Kapil Dev: భారత క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్ వీరోచిత ఇన్నింగ్స్ కు 39 ఏళ్ళు!