సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా 2022లో సిరీస్ సమం అయ్యింది. నిర్ణయాత్మక మ్యాచ్ వరుణుడి కారణంగా రద్దవడంతో.. ఇప్పటికీ టీమిండియా అప్రదిష్ఠకు తెరపడలేదు. 2010 నుంచి టీమిండియాలో సౌత్ ఆఫ్రికా ఒక్క లిమిటెడ్ ఓవర్స్ సిరీస్ కూడా ఓడిపోలేదు.. ఆ రికార్డును ఈ సిరీస్ తో నైనా బ్రేక్ చేద్దామనుకున్న టీమిండియాకు నిరాశే ఎదురైంది. బెంగళూరు చినస్వామి స్టేడియంలో జరగాల్సిన ఆఖరి టీ20 వర్షం కారణంగా రద్దవడంతో వేలాదిగా తరలివచ్చిన అభిమానులు వరుణుడిని తిట్టుకుంటూ ఇంటిముఖం పట్టారు. రాత్రి 9.40 గంటల వరకు తడుచుకుంటూ ఎదురుచూసిన ప్రేక్షకులు మ్యాచ్ క్యాన్సిల్ కావడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మహరాజ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ 3.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 7 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేయగా.. గైక్వాడ్ 12 బంతుల్లో ఒక బౌండరీ సాయంతో 10 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్, పంత్ క్రీజులో బ్యాటింగ్ చేస్తుండగా వర్షం కారణంగా 3.3 ఓవర్లకు మ్యాచ్ ని నిలిపివేశారు. ఆ తర్వాత ప్రారంభించే అవకాశం చివరికి మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. Update Play has heen officially called off. The fifth & final @Paytm #INDvSA T20I has been abandoned due to rain. #TeamIndia pic.twitter.com/tQWmfaK3SV — BCCI (@BCCI) June 19, 2022 ప్రస్తుతం రుజురాజ్ గైక్వాడ్ పై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతోంది. అదేంటి సిరీస్ లో పర్వాలేదు అనిపించాడు కదా.. మరెందుకు ట్రోలింగ్ అనుకుంటున్నారా? అయితే ఆ ట్రోలింగ్ బ్యాటింగ్ కు సంబంధించి కాదులెండి.. మ్యాచ్ కు వర్షం వల్ల అంతరాయం కలిగిన సమయంలో రుతురాజ్ డగౌట్ కూర్చొని సహచరులతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో గ్రౌండ్ స్టాఫ్ నుంచి ఒక వ్యక్తి వచ్చి రుతురాజ్ ను సెల్ఫీ అడిగాడు. సెల్ఫీ తీసుకునేందుకు వచ్చి అతని పక్కన కూర్చోగా.. చేయితో అతడిని పక్కకు నెట్టేశాడు. తగలకుండా కూర్చోలేవా అన్నట్లుగా ప్రవర్తించాడు. అంతేకాకుండా అతను ఫోన్ పట్టుకుని సెల్ఫీకోసం ఎదురుచూస్తున్నా.. అసలు పట్టించుకోకుండా పక్కవారితో జోకులు వేస్తూ కనిపించాడు. Very bad and disrespectful gesture by Ruturaj Gaikwad. Sad to see these groundsmen getting treated like this #RuturajGaikwad pic.twitter.com/jIXWvUdqIX — Arnav (@imarnav_904) June 19, 2022 ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసిన వారంతా రుజురాజ్ గైక్వాడ్ అప్పుడే సెలబ్రిటీ అయిపోయానని ఫీల్ అవుతున్నాడా? లేక కళ్లు నెత్తికెక్కాయా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా అతను గ్రౌడ్ స్టాఫ్ అని అంత చులకనగా చూస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం కరోనా కారణంగా రుజురాజ్ అలా చేసుంటాడేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రుజురాజ్ ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదంటూ కామెంట్ చేస్తున్నారు. రుజురాజ్ గైక్వాడ్ ప్రవర్తన విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Very disrespectful behaviour from Ruturaj gaikwad,When the ground staff came to take selfie #INDvSA pic.twitter.com/dHtZd3oy3T — @_Better_Boy (@VaishnavRBiju1) June 19, 2022 #ruturajgaikwad very shameful utterly disgusting act by this good for nothing opener gandakwad as that guy sat for the selfie he just touched him slightly and he is asking him to b away from him like he dont want to be touchd shameful 1/2 — Deepak godhan (@thedpkgodhan) June 20, 2022 ఇదీ చదవండి: మహిళా క్రికెటర్‌పై మాజీ ప్లేయర్ లైంగిక దాడి.. ఆ తర్వాత స్నేహితులతో కలిసి! ఇదీ చదవండి: ఒలంపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రాకు తృటిలో తప్పిన పెను ప్రమాదం!