పాకిస్థాన్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఫ్రాంచైజీ క్రికెట్ మోజులో పడి యంగ్ క్రికెటర్స్ టెస్టు క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తుంటే.. సీనియర్లు అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెబుతున్నారు. నిన్న శ్రీలంక స్టార్ స్పిన్నర్ హసరంగా టెస్టు క్రికెట్ కి వీడ్కోలు పలకగా.. ఒక రోజు గడవకముందే పాకిస్థాన్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ వహాబ్ రియాజ్ తాజాగా తన అంతర్జాతీయ ప్రస్థానాన్ని ముగించాడు. ఇన్ని రోజులు పాకిస్థాన్ కి ప్రాతినిధ్యం వహించడం తనకు గొప్ప గౌరవమని.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. తన క్రికెట్ ప్రయాణంలో అండగా నిలిచిన కుటుంబం, కోచ్, మెంటార్, సహచర ఆటగాళ్లకు ధన్యవాదాలు తెలియజేశాడు.
2008 లో తొలిసారి జింబాబ్వేతో వన్డేల్లో రియాజ్ అరంగ్రేటం చేసాడు. అదే ఏడాది టీ 20ల్లో, 2010లో టెస్టు క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. అంతర్జాతీయ ప్రస్తానం చూసుకుంటే 27 టెస్టుల్లో 81 , 91 వన్డేల్లో 121 , 36 టీ 20ల్లో 34 వికెట్లు పడగొట్టాడు. వహాబ్ 2011, 2015, 2019 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టులో సభ్యుడు. 2011 వరల్డ్ కప్ లో టీమిండియాపై జరిగిన సెమి ఫైనల్ మ్యాచులో 5 వికెట్ల ప్రదర్శన, 2015 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై జరిగిన క్వార్ట్రర్ ఫైనల్లో షార్ట్ పిచ్ బంతులతో కంగారులను బెంబేలెత్తించడం రియాజ్ కెరీర్ లో హైలెట్ గా నిలిచాయి. 2020 లో చివరిసారిగా రియాజ్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడు.
అంతర్జాతీయ క్రికెట్ నుండి వీడ్కోలు పలికినా ఫ్రాంచైజీ లీగ్ లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేసాడు. ప్రస్తుతం రియాజ్ శ్రీలంక ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్నాడు. ఇక క్రికెట్ నుండి దూరమైనా ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నాడని సమాచారం. వస్తున్న కథనాల ప్రకారం ఈ ఏడాది మార్చిలో పంజాబ్ క్రీడా శాఖ మంత్రిగా నియమితుడైనట్లు సమాచారం. మరి వహబ్ రియాజ్ ఇలా అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
🏏 Stepping off the international pitch
🌟 After an incredible journey, I’ve decided to retire from international cricket. Big thank you to PCB, my family, coaches, mentors, teammates, fans, and everyone who supported me. 🙏
Exciting times ahead in the world of franchise…
— Wahab Riaz (@WahabViki) August 16, 2023