పాకిస్థాన్‌తో జరుగుతున్న హిస్టారిక్ టెస్టును.. హిట్టింగ్ టెస్టుగా మార్చేసింది ఇంగ్లండ్ టీమ్. దాదాపు 17 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. తొలి టెస్టు, తొలి ఇన్నింగ్స్‌తోనే ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఏకంగా 112 ఏళ్లుగా చెక్కుచెదరని అరుదైన రికార్డు పాక్ పుణ్యామా అని బ్రేక్ అయింది. 1910లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్ ఆడుతూ.. తొలి రోజు 6 వికెట్ల నష్టానికి 494 పరుగులు చేసింది. నిన్న మధ్యాహ్నం వరకూ.. తొలి రోజు ఆటకు అదే అత్యధిక స్కోర్. కానీ.. ఇంగ్లండ్ బ్యాటర్ల అగ్రెసివ్ క్రికెట్‌తో 112 ఏళ్ల ఆ రికార్డు గల్లంతైంది. తొలి రోజు 4 వికెట్ల నష్టానికి 506 పరుగుల భారీ స్కోర్ చేసి కొత్త చరిత్ర లిఖించింది బెన్ స్టోక్స్ సేన. పైగా కేవలం 75 ఓవర్ల ఆట మాత్రమే జరిగినా.. 506 పరుగులు బాదారు. ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
ఒక టెస్టు మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు ఏకంగా నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేయడం కూడా ప్రపంచ రికార్డే. ఇలాంటి బ్యాటంగ్‌తో పాకిస్థాన్ బౌలర్లను ఊచకోత కోసిన ఇంగ్లండ్.. రెండో రోజు కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయి.. వీలైనంత త్వరగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడానికి మరింత వేగంగా ఆడింది. కానీ.. తొలి రెండు కంటే రెండో రోజు పాక్ బౌలర్లు కాస్త మెరుగ్గా బౌలింగ్ చేయడంతో.. 506 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆరంభించిన ఇంగ్లండ్ 657 పరుగులకు ఆలౌట్ అయింది. హెర్రీ బ్రూక్ 116 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సులు బాది 153 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జాక్ కాల్రే 122, బెన్ డకెట్ 107, ఓల్లీ పోప్ 108 పరుగులు చేసి సెంచరీలు బాదారు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కేవలం 18 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఇంగ్లండ్ జట్టు తొలి రోజు సృష్టించిన ఈ విధ్వంసానికి పాక్ బౌలర్లు పరుగుల వరదలో కొట్టుకుపోయారనే చెప్పాలి. ఏకంగా ఇద్దరు బౌలర్లు సెంచరీ, ఒక బౌలర్ డబుల్ సెంచరీ పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా జాహిద్ మహమూద్ 33 ఓవర్లు వేసి ఏకంగా 235 పరుగులు సమర్పించుకున్నాడు. అతను 4 వికెట్లు పడగొట్టినా.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. పైగా జాహిద్‌కు ఇదే తొలి టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం. అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా జాహిద్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అలాగే నసీమ్ షా 24 ఓవర్లు వేసి 140, మొహమ్మద్ అలీ 24 ఓవర్లలో 124 పరుగులు ఇచ్చుకున్నారు. కాగా.. జాహిద్ మహమూద్‌ను తుది జట్టులోకి ఎంపిక చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అలాగే రావాల్పిండి పిచ్‌పై కూడా ఒక రేంజ్‌లో ట్రోలింగ్ సాగుతోంది. పిచ్ హైవేలా ఉందని.. బంతి బ్యాట్‌పైకి వస్తుందని పాక్ అభిమానులే పాక్ క్రికెట్‌బోర్డును తిట్టి పోస్తున్నారు. హిస్టారిక్ టెస్టుకు ఇలాంటి పిచ్ ఎలా తయారుచేయిస్తారంటూ మండిపడుతున్నారు.
Double Century for Zahid Mahmood #PAKvENG #EngvsPak pic.twitter.com/XcRragHy3X
— RVCJ Media (@RVCJ_FB) December 2, 2022
PAK vs ENG
657 runs in 606 balls
This is test match😂 pic.twitter.com/gzeqD21khe— Shoaib JUTT 🇵🇰(Back up) (@ShoaibJUTTpkz) December 2, 2022
Battle of centurions#EngvsPak pic.twitter.com/El9b3u0ir3
— 𝐏𝐚𝐫𝐭𝐡 (@fallenclax) December 2, 2022