ఫ్రెంచ్ ఓపెన్ 2021 ఫైనల్లో అద్భుత విజయం సాధించి, 19వ గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకున్న ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జోకవిచ్ ఓ కుర్రాడి అభిమానికి తన విన్నింగ్ రాకెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. గ్రీకు వీరుడు, సిట్సిపాస్‌తో జరిగిన హోరాహోరీ పోరులో తొలి రెండు సెట్లను కోల్పోయిన జకో ఆ తర్వాత వరుసగా మూడు సెట్లలో గెలిచి రెండోసారి కెరీర్ స్లామ్ సాధించాడు. ఈ సందర్భంగా తాను టైటిల్ నెగ్గడానికి సహకరించిన కుర్రాడికి ఆయన అపురూపమైన బహుమతిని అందజేశాడు. తన పోరాటంలో కీలకపాత్ర పోషించిన చిన్నారి అభిమానికి కృతజ్ఞతగా విన్నింగ్ రాకెట్‌ను బహుకరించాడు.
ఇదిలా ఉంటే, తన అభిమాన ఆటగాడి నుంచి ఊహించని గిఫ్ట్‌ను అందుకున్న ఆ కుర్రాడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పట్టలేని సంతోషంతో గంతులేస్తూ కేరింతలు పెట్టాడు. మ్యాచ్ మొత్తం ఆ చిన్నారి జోకవిచ్కు సపోర్ట్ చేస్తూ, అతన్ని ఉత్సాహపరిచాడు. తొలి రెండు సెట్లు ఓడినా అతడు తన వెంటే నిలిచాడని, తన రాకెట్ ఇవ్వడానికి అతని కన్నా బెస్ట్ పర్సన్ మరొకరు కనిపించలేదని జోకవిచ్ అన్నాడు.
ఈ మొత్తం సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా, ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) తో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ తుది సమరంలో చారిత్రక విజయాన్ని సాధించాడు. టైటిల్ విజేత జొకోవిచ్‌కు 14 లక్షల యూరోలు., రన్నరప్ సిట్సిపాస్‌కు 7 లక్షల 50 వేల యూరోలు ప్రైజ్‌మనీగా లభించింది.