టీమ్ ఇండియా క్రికెట్ లో సచిన్ టెండుల్కర్ కి ప్రత్యేక స్థానం ఉంది.. తన ఆటతీరుతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అందుకే క్రికెట్ అభిమానులు సచిన్ ని క్రికెట్ దేవుడు అని పిలుస్తుంటారు. సచిన్ కి కోట్ల మంది అభిమానులు ఉన్నా ఆయన ఓ అభిమానిని ప్రత్యేకంగా అభిమానిస్తాడు.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని ఆటలు ఉన్నా.. అందులో క్రికెట్ అంటే చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ వరకు ఎంతగా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. టీమ్ ఇండియాలో ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. రెండు దశాబ్ధాలకు పైగా తన ఆటతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ అంటే ఇష్టపడని వారు ఉండరు.. సచిన్ ని క్రికెట్ దేవుడు గా కొలుస్తుంటారు. సచిన్ టెండుల్కర్ కి ఎంతమంది అభిమానులు ఉన్నా.. అందులో ఓ అభిమాని చాలా ప్రత్యేకం. ఎంతగా అంటే ఆ అభిమాని అంటే సచిన్ కి చాలా ఇష్టం.. ఆయన పేరు సుధీర్ కుమార్ చౌదరి. ఇంతకీ ఈ సుధీర్ కుమార్ చౌదరి ఎవరు.. ఆయన అంటే సచిన్ కి ఎందుకు అంత అభిమానం అన్న విషయం గురించి తెలుసుకుందాం..
భారత దేశంలో సచిన్ టెండుల్కర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. అందుకే సచిన్ ని క్రికెట్ దేవుడు అని అంటారు. టీమ్ ఇండియా లో సచిన్ ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. నేడు సచిన్ 50వ జన్మదినం.. ఈ సందర్భంగా ఆయనకు ఎంతోమంది అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సచిన్ కి కోట్ల మంది అభిమానులు ఉన్నా.. అందులో ఓ అభిమాని మాత్రం ఎంతో ప్రత్యేకం… అతని పేరే సుదీర్ కుమార్ చౌదరి. సచిన్ రిటైర్మెంట్ అయ్యేవరకు టీమ్ ఇండియా ఎక్కడ ఆడుతున్నా.. అక్కడికి వెళ్లి ఒళ్లంతా త్రివర్ణ పతాకం రంగులు పూసుకొని చేతిలో జాతీయ జెండా పట్టుకొని స్టాండ్స్ లో సందడి చేసేవాడు సుధీర్ కుమార్ చౌదరి. సచిన్ టెండుల్కర్ అంటే ప్రాణాలు ఇచ్చేంతగా అభిమానిస్తాడు.
సుధీర్ కుమార్ చౌదరి.. క్రికెట్ దేవుడు సచిన్ ని ఎంతగా అభిమానిస్తాడంటే.. ఆయన ఆడిన ప్రతి మ్యాచ్ ని చూసేందుకు తన ఆస్తులను సైతం అమ్ముకున్నాడు. శరీరం మొత్తం త్రివర్ణ పతాకం రంగు పూసుకొని ఛాతిపై సచిన్ టెండుల్కర్ జెర్సీ ముంద్రించుకొని.. జాతీయ జెండా పట్టుకొని టీమ్ ఇండియా ఎక్కడ మ్యాచ్ లు అక్కడ దర్శనమిచ్చేవాడు సుధీర్. తన ఆరో ఏటనే సచిన్ కి వీరాభిమాని అయ్యాడు. 14 ఏళ్ల వయసులో చదువు ఆపి కొంతకాలం టీచర్ గా పనిచేశాడు. ఇక తన జీవితం క్రికెట్ మ్యాచ్ లకే అంకితం అని తీర్మానం చేసుకొని చిన్న చిన్న పనులు చేసి డబ్బు సంపాదించి.. ప్రజలు ఇచ్చే డబ్బుతో తనదైన స్టైల్లో తయారై క్రికెట్ స్టేడియం కి వెళ్లి ఆటను తిలకించేవాడు.
2011, ఏప్రిల్ 2 న టీమ్ ఇండియా వన్డే వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. డ్రెస్సింగ్ రూమ్ లో భారత ఆటగాళ్లు సైతం సంబరాలు చేసుకున్నారు.. ఆ సమయంలో సచిన్ టెండుల్కర్ స్వయంగా సుధీర్ ని ఆహ్వానించి గౌరవించాడు. ఒకసారి టీమ్ ఇండియా కాన్పూర్ లో మ్యాచ్ ఆడటానికి వచ్చింది. సచిన్ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుండగా.. అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సుదీర్ కుమార్ వెళ్లాడు.. కానీ అక్కడ పోలీసులు అతన్ని వారించడమే కాదు..దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నారు. అది చూసిన సచిన్ అక్కడికి వెళ్లి ఇతడు నాకు వీరాభిమాని.. ఇతనికి నేనే ఫ్యాన్ ని అని చెప్పాడు. సచిన్ ఆడుతున్న క్రికెట్ చూడటానికి తన సైకిల్ పై వందల కిలోమీటర్లు వెళ్లేవాడు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లో భారత్ ఆడిన సీరీస్ చూడటానికి సైకిల్ పై వెళ్లాడంటే.. సచిన్ అంటే ఎంతగా అభిమానించేవాడో అర్థం చేసుకోవచ్చు.