పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. చివరి బాల్ వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
అలాగే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 64, వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 53 పరుగులు చేసి రాణించారు. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని భారీ స్కోర్ దిశగా సాగుతున్న ఈ ఇద్దరిని వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ అసాధారణమైన ఫీల్డింగ్‌తో పెవిలియన్‌కు పంపించాడు. 18వ ఓవర్‌లో మిడ్ వికెట్ వైపు బంతిని కొట్టి ఈజీ సింగిల్ కోసం వెళ్లిన శుభ్‌మన్ గిల్‌ను.. కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో బంతిని ఒడిసి పట్టుకుని డైరెక్ట్ త్రో గిల్‌ను రనౌట్ చేశాడు.
ఈజీగా సింగిల్ వస్తుందని కొంత నిర్లక్ష్యంగా పరిగెత్తిన గిల్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు. మెరుపు వేగంతో బంతిని విసిరి 119 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. ఇక వన్‌డౌన్‌లో బ్యాటింగ్ వచ్చి గిల్ లేని లోటును తీరుస్తూ.. అప్పటికే టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న కెప్టెన్ ధావన్‌కు జత కలిసిన శ్రేయస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి వికెట్ తీసేందుకు ఆపసోపాలు పడిన వెస్టిండీస్ బౌలర్లకు శ్రేయస్ అయ్యర్ కూడా కొరకరాని కొయ్యగా మారాడు.
కానీ.. మోతీ వేసిన ఇన్నింగ్స్ 36వ ఓవర్ చివరి బంతిని రూమ్ తీసుకుని అవుట్‌సైడ్ లెగ్ వైపు వెళ్లి.. షార్ట్ లెగ్ పై నుంచి షాట్ ఆడాడు. కానీ సరైన ఎలివేషన్ లభించలేదు. దీంతో షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న పూరన్ అమాంతం గాల్లోకి లేచి ఒంటిచేత్తో బంతిని అందుకున్నాడు. భూమి నుంచి దాదాపు 10, 12 అడుగుల ఎత్తు నుంచి వెళ్తున్న బంతిని అందుకుని అందరిని ఆశ్యర్యానికి గురి చేశాడు. అద్భుతమైన త్రోతో గిల్ వికెట్ పడగొట్టిన పూరన్.. మరో అద్భుతమైన క్యాచ్‌తో శ్రేయస్‌ను పెవిలియన్ చేర్చాడు.
కెప్టెన్‌గా ఫీల్డింగ్‌లో అద్భుతాలు చేస్తూ.. జట్టు సహచరులకు ఆదర్శంగా నిలిచాడు. టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న టీమిండియా టాప్ ఆర్డర్‌ను పూరన్ తన పీల్డింగ్‌తో అడ్డుకోవడం వల్లే ఈ మ్యాచ్‌లో 400పై చిలుకు పరుగులు చేయాల్సిన టీమిండియా 308 పరుగులకు పరిమితం అయింది. కాగా.. ఫీల్డింగ్‌లో అదరగొట్టిన పూరన్ బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరి ఈ మ్యాచ్‌లో పూరన్ ఫీల్డింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
It was surely one of the finest catches by Nicholas Pooran. #ShreyasIyer #WIvIND pic.twitter.com/CtESvpDaf1
— CBTF Speed News (@cbtfspeednews) July 22, 2022
Nicholas Pooran 👏👏#WIvIND #WestIndies #India #TeamIndia #Shreyasiyer #ShubmanGil pic.twitter.com/MPW0OHl9PA
— CRICKETNMORE (@cricketnmore) July 22, 2022
Shubman Gill is run out by Nicholas Pooran.#WIvIND #INDvsWI pic.twitter.com/g0Es1n4or1
— CRICKET VIDEOS🏏 (@Abdullah__Neaz) July 22, 2022
What a catch by the captain Nicholas Pooran to dismiss Shreyas Iyer. pic.twitter.com/lLvZIRI24V
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 22, 2022