‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. ఒకే ఫ్రాంచైజీపై వెయ్యి అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. గురువారం జరిగిన కోల్‌కతా మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనత సాధించాడు. 2008 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడుతున్న రోహిత్ ఇప్పటివరకు 208 మ్యాచ్‌లలో 31.5 బ్యాటింగ్ సగటుతో 5,513 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో రోహిత్ హైఎస్ట్ స్కోర్ 109 నాటౌట్. ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు రోహిత్ శర్మ 40 హాఫ్ సెంచరీలు చేశాడు.
కోల్‌కతా మ్యాచ్‌కు ముందు 982 పరుగులతో ఉన్నాడు రోహిత్ శర్మ. మ్యాచ్‌లో నాలుగో ఓవర్‌లో రెండో బంతిని ఫోర్ బాది ఈ ఫీట్ సాధించాడు హిట్‌మ్యాన్. ఈ జాబితాలో రోహిత్ తర్వాత సన్‌రైజర్స్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. పంజాబ్ కింగ్స్‌పై వార్నర్ 943 పరుగులు చేశాడు. తర్వాతి స్థానంలో బెంగళూరి స్కిప్పర్ విరాట్ కోహ్లీ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 909 పరుగులు చేశాడు. రోహిత్ మరో 2 సిక్సులు బాదితే టీ20ల్లో 400 సిక్సులు బాదిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. పవర్‌ప్లేలో మరో 2 సిక్సులు కొడితే ఐపీఎల్ పవర్ ప్లేలో 50 సిక్సులు కొట్టిన తొలి ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మన్‌గా రోహిత్ మరో రికార్డు నెలకొల్పుతాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో రోహిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్.. సురేష్ రైనాను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నాడు. రైనా 5,495 పరుగులతో నాలుగు స్థానానికి పడిపోయాడు. రోహిత్ 5,513 పరుగులు చేశాడు. ఈ జాబితాలో కోహ్లీ (6081), శిఖర్ ధావన్ (5619) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
గురువారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ(30 బంతుల్లో 33 పరుగులు) సునీల్ నరైన్ బౌలింగ్‌లో బౌండరీ కోసం ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. డీకాక్ అప్పటివరకు అద్భుత భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్ ఔట్ కావడంతో ముంబయి టీమ్ ఫలితమే మారిపోయింది.
🚨 Landmark Alert🚨@ImRo45 becomes the first batsman to score 1⃣0⃣0⃣0⃣ runs or more against a team in the IPL. 👏 👏 #VIVOIPL #MIvKKR
Follow the match 👉 https://t.co/SVn8iKC4Hl pic.twitter.com/xU0er9xBcK
— IndianPremierLeague (@IPL) September 23, 2021