ఆడింది రెండో మ్యాచ్‌లు కానీ.. ఐపీఎల్ సెకెండాఫ్‌లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు ‘వెంకటేశ్ అయ్యర్’. ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాడిగా వెంకటేశ్ అయ్యర్ ఆడుతున్న షాట్లు క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాయి. ఏ బాల్‌నైనా బౌండిరీకే తరలించాలి అన్న చందంగా అతని బ్యాటింగ్ ఉంటోంది. కేకేఆర్ మంచి ఓపెనర్ దొరికేశాడు అని ఇప్పటికే అభిమానులు ఫిక్స్ అయిపోయారు. రెండో మ్యాచ్‌లోనే వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. రెండ్ మ్యాచ్‌లలో అతని స్ట్రైక్ రేట్(164.9) చూసి అందరూ […]
‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. ఒకే ఫ్రాంచైజీపై వెయ్యి అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. గురువారం జరిగిన కోల్‌కతా మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనత సాధించాడు. 2008 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడుతున్న రోహిత్ ఇప్పటివరకు 208 మ్యాచ్‌లలో 31.5 బ్యాటింగ్ సగటుతో 5,513 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో రోహిత్ హైఎస్ట్ స్కోర్ 109 నాటౌట్. ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు రోహిత్ శర్మ 40 హాఫ్ […]
యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 సెకెండాఫ్ ఫుల్ జోష్‌తో నడుస్తోంది. ప్రతి మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగుతోంది. ముంబయి, కేకేఆర్ మ్యాచ్ పూర్తిగా వన్‌సైడెడ్‌గా సాగింది. టాస్ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకున్న కోల్‌కతా తొలుత కొంచం పట్టు తప్పినట్లు కనిపించినా.. ముంబయి విధ్వంసకర బ్యాటింగ్ చేయకుండానే కట్టడి చేశారు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది ముంబయి టీమ్. ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్ మినహా ముంబయి బ్యాట్స్‌మన్లు పెద్దగా […]
మరికొన్ని గంటల్లో యూఏఈ వేదికగా ఐపీఎల్ సెకెండ్ హాఫ్ సందడి షురూ కానుంది. క్రికెట్ అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించే వార్త తొలి మ్యాచ్‌లోనే దిగ్గజ టీమ్‌లు పోటీకి సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 19న చెన్నై సూపర్ కింగ్స్, ది ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి. 7 మ్యాచ్‌లలో ఐదు నెగ్గి పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉంది సీఎస్కే. ఏడు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు, 3 పరాజయాలతో నాలుగోస్థానంలో ఉంది ముంబయి. విజయాల సంగతి పక్కన పెడితే విదేశీ ఆటగాళ్ల […]
యూఏఈ వేదికగా మరో కొన్ని గంటల్లో ఐపీఎల్ సెకెండ్ హాఫ్ సందడి మొదలు కానుంది. అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. నెట్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ మ్యాచ్‌లతో ఫుల్ జోష్ మీదున్నారు ఆటగాళ్లు. అన్ని జట్లకంటే ముందే యూఏఈ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ సెప్టెంబర్ 19న ముంబయిపై సెకెండ్ హాఫ్‌లో తొలి మ్యాచ్‌ను ఆడనుంది. పలు కారణాలు, గాయాలు దృష్ట్యా సీఎస్కేకి ఈసారి విదేశీ ఆటగాళ్లు దూరమయ్యారు. ఇలా ఉండగా చైన్నై టీమ్‌కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. […]
ఐపీఎల్ సందడి మళ్ళీ షురూ అయిపోయింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ దుబాయికి, ముంబై ఇండియన్స్ టీం అబు దాబీకి చేరుకున్నాయి. ఆటగాళ్లు వారికి కేటాయించిన హోటల్స్ లో క్వారంటైన్ లో ఉంటున్నారు. కరోనా నిబంధనలు అబుదాబీ చాలా కఠినంగా అమలు చేస్తుంది. అందుకే అక్కడ దిగగానే ముంబై ఇండియన్ ప్లేయర్స్ అందరికి జీపీఎస్ వాచెస్ అందజేశారు. క్వారంటైన్ లో ఉండే 6 రోజులు ఆటగాళ్లు జీపీఎస్ వాచెస్ పెట్టుకోవాలని అబుదాబీ హెల్త్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. […]