యూఏఈ వేదికగా మరో కొన్ని గంటల్లో ఐపీఎల్ సెకెండ్ హాఫ్ సందడి మొదలు కానుంది. అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. నెట్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ మ్యాచ్‌లతో ఫుల్ జోష్ మీదున్నారు ఆటగాళ్లు. అన్ని జట్లకంటే ముందే యూఏఈ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ సెప్టెంబర్ 19న ముంబయిపై సెకెండ్ హాఫ్‌లో తొలి మ్యాచ్‌ను ఆడనుంది. పలు కారణాలు, గాయాలు దృష్ట్యా సీఎస్కేకి ఈసారి విదేశీ ఆటగాళ్లు దూరమయ్యారు. ఇలా ఉండగా చైన్నై టీమ్‌కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈసారి సామ్ కరణ్, ఫాఫ్ డుప్లెసిస్ రూపంలో మరో షాక్ తగలనుంది.
అందరికంటే యూఏఈకి ఆలస్యంగా చేరుకున్న సామ్ కరణ్ ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉండనున్నాడు. సెప్టెంబర్ 21 వరకు సామ్ కరణ్ క్వారంటైన్‌లోనే ఉంటాడు. అంటే ముంబయితో మ్యాచ్‌కు సామ్ దూరమైన విషయం ఖాయమే. మరోవైపు డుప్లెసిస్ కూడా తొలి మ్యాచ్‌లు ఆడే పరిస్థితి కనిపించడం లేదు. సీపీఎల్‌లో గాయాలపాలైన డుప్లెసిస్.. అక్కడ కూడా కీలక మ్యాచ్‌లు ఆడలేదు. గజ్జలో గాయం అంత వెంటనే తగ్గే అవకాశం లేదు కాబట్టి.. తొలి మ్యాచ్‌లలో డుప్లెసిస్ ఉండడమే అంచనా వేస్తున్నారు. డుప్లెసిస్ స్థానాన్ని రాబిన్ ఊతప్పతో భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గైక్వాడ్‌తో డుప్లెసిస్ తరహాలో ఊతప్ప కూడా ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పగలడు అనే అంచనాలో ఉన్నట్లు తెలుస్తోంది. సామ్ కరణ్ స్థానాన్ని ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజల్‌వుడ్‌తో భర్తీ చేసే అవకాశం ఉంది. సామ్ కరణ్‌లా దూకుడుగా కాకపోయినా.. హాజల్‌వుడ్ కూడా బౌండ్రీలు బాదగలడు. అంబటిరాయుడు కూడా ఓపెనింగ్ చేసే అవకాశం లేకపోలేదు.
ఓపెనింగ్ ఊతప్ప/అంబటి రాయుడు(అంచనా)- రుతురాజ్ గైక్వాడ్, ఫస్ట్ డౌన్‌లో మెయీన్ అలీ, నాలుగో స్థానంలో అంబటిరాయుడు, సురేశ్ రైనా, ధోనీ, జడేజా, శార్దూల్ ఠాకూర్, చాహర్, ఎంగిడి, హాజల్‌వుడ్ బరిలో దిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రకారం చూసుకుంటే స్టార్ ప్లేయర్లు దూరమైనా కూడా చెన్నై బ్యాటింగ్ లైనప్ చాలా టఫ్‌గా కనిపిస్తోంది. తొమ్మిది మంది ఆటగాళ్లు బ్యాటింగ్ చేయగలగడం సీఎస్కేకి కొంచెం ఊరటకలిగించే విషయం. బౌలింగ్ పరంగా పేస్ బాగుండగా.. ఏకైక స్పిన్నర్‌గా జడేజా ఉండబోతున్నాడు.
రాబిన్ ఊతప్ప/ఫాఫ్ డూ ప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, సురేశ్ రైనా, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఎంగిడి, హాజల్ వుడ్
ముంబయి,చెన్నై టీమ్ మ్యాచ్‌లో ఎవరు విజేతలుగా నిలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ల ద్వారా మాకు తెలియజేయండి.