ఐపీఎల్ సందడి మళ్ళీ షురూ అయిపోయింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ దుబాయికి, ముంబై ఇండియన్స్ టీం అబు దాబీకి చేరుకున్నాయి. ఆటగాళ్లు వారికి కేటాయించిన హోటల్స్ లో క్వారంటైన్ లో ఉంటున్నారు. కరోనా నిబంధనలు అబుదాబీ చాలా కఠినంగా అమలు చేస్తుంది. అందుకే అక్కడ దిగగానే ముంబై ఇండియన్ ప్లేయర్స్ అందరికి జీపీఎస్ వాచెస్ అందజేశారు. క్వారంటైన్ లో ఉండే 6 రోజులు ఆటగాళ్లు జీపీఎస్ వాచెస్ పెట్టుకోవాలని అబుదాబీ హెల్త్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది.
ముంబావు ఇండియన్స్ కంటే ముందే దుబాయి చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకు మాత్రం ఆలాంటి వాచెస్ ఏం ఇవ్వలేదని సమాచారం. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇంకా 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ యూఏఈ వేదికగా టోర్నీని బీసీసీఐ నిర్వహించబోతోంది. సెప్టెంబరు 19న ఫస్ట్ మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌తో దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టనుంది. తర్వాత సెప్టెంబర్ 24న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో షార్జా వేదికగా చెన్నై మ్యాచ్ ఆడనుంది.
అక్టోబర్ 10న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ నిర్వహిస్తుండగా.. 11న తొలి ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఆపై అక్టోబర్ 13న సెకండ్ క్వాలిఫయర్ ఉంటుంది. 15న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా, టోర్నీ వాయిదాపడేసరికి మొత్తం 29 మ్యాచ్‌లు జరగ్గా అందులో డిల్లీ క్యాపిటల్స్ టాప్‌లో నిలిచింది. ఆ జట్టు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. మరోవైపు చెన్నై జట్టు 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతోనే మూడో స్థానంలో తర్వాత ముంబయి 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో నాలుగో స్థానంలో నిలిచాయి.