క్రికెట్ లో ధోని, రైనా మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి రిలేషన్ చూస్తే ముచ్చట గొలిపేలా ఉండేది. ఎన్నో ఏళ్లుగా టీమిండియాకు ఐపీఎల్ కి కలిసి ఆడిన వీరిద్దరూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
క్రికెట్ లో ధోని, రైనా మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఇండియన్ క్రికెట్ లోనే కాదు ఐపీఎల్ లో కూడా వీరు ఎన్నో ఏళ్లుగా తన రిలేషన్ ని కొనసాగించారు. వీరిద్దరిని రామ లక్ష్మణులుగా అభిమానులు భావిస్తారు. ధోని ఏం చెప్పినా రైనా దానిని తూచా తప్పకుండా పాటిస్తాడనే పేరుంది. వీరిద్దరి రిలేషన్ చూస్తే ముచ్చట గొలిపేలా ఉండేది. అయితే ధోని సమక్షంలో ఉన్న రైనాకు రావాల్సిన గుర్తింపు రాలేదనే అభిప్రాయలు కూడా ఉన్నాయి. అయినా ఇలాంటి విషయాలు గురించి రైనా ఏనాడు పెద్దగా పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా.. తాజాగా రైనా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తనకు వచ్చిన ఛాన్స్ లు అన్ని ధోని వల్లే పోయాయని సంచలన వ్యాఖ్యలు చేసాడు.
రైనా అంటే అందరికీ ఐపీఎల్ గుర్తొస్తుంది. భారత క్రికెట్ టీం తరపున ఆడినా ఐపీఎల్ లో బాగా పాపులర్ అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతూ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ఐపీఎల్ లో అత్యంత నిలకడగా ఆడిన రైనాకు “మిస్టర్ ఐపీఎల్” అనే ట్యాగ్ కూడా ఇచ్చారు. 2021 వరకూ ధోనీ తర్వాత చెన్నై జట్టుకి వైస్ కెప్టెన్‌గా కొనసాగాడు. ఈ క్రమంలో చెన్నై 3 ఐపీఎల్ టైటిల్స్ ని గెలిచింది. అయితే ఫామ్ లేని కారణంగా 2022లో మొదటిసారి సురేష్ రైనాను చెన్నై సూపర్ కింగ్స్ వేలానికి వదిలేసింది. ఇక ఆ తర్వాత ఎవరూ కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. దీంతో రైనా ఐపీఎల్ ప్రస్తానం ముగిసింది. ఆకాశ్ చోప్రా హోస్ట్ చేస్తున్న ‘హోమ్ ఆఫ్ హీరోస్’ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సురేష్ రైనా.. ధోనీకి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేసాడు.
“ఐపీఎల్‌లో నాకు చాల జట్ల నుండి కెప్టెన్సీ ఇస్తామని ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ విషయంలో నేను చెప్పిన సలహాని పాటించాను. ధోని చెప్పిన ఒక్క మాటతోనే అన్ని ఆఫర్లని వదులుకున్నాను. దేశవాళీ క్రికెట్ ఆడుతున్నప్పుడు నేను ఉత్తరప్రదేశ్ జట్టుకు కెప్టెన్. అంతేకాదు ధోనీ లేని సమయంలో చెన్నై జట్టుకు కెప్టెన్సీ చేసాను. ఎప్పుడైతే చెన్నై జట్టు సస్పెన్షన్‌కు గురైందో గుజరాత్ లయన్స్ జట్టుకు సారథిగా వ్యవహరించా. దాంతో ఐపీఎల్‌లో చాలా టీమ్స్ కెప్టెన్సీ ఆఫర్స్ ఇచ్చాయి. అయితే ధోనీ భాయ్ మాత్రం నన్ను జట్టును విడిచి పోవద్దని చెప్పాడు. తాను చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్‌గా ఉన్నంత కాలం.. నువ్వే వైస్ కెప్టెన్‌గా ఉంటావని హామీ ఇచ్చాడు. అన్నట్లుగానే నేను జట్టులో ఉన్నన్నీ రోజులు ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు. అందుకే ఇతర జట్లు ఇచ్చిన ఆఫర్స్‌ను వదులుకున్నా.కెప్టెన్ మీద నాకు ఎప్పుడూ కోరిక లేదు. నేనెప్పుడూ జట్టు ప్లేయర్‌గానే ఉండడానికి ఇష్టపడతాను. నా టీమ్ మేట్స్ కి పరిష్కరించడం మాత్రమే నాకు తెలుసు”. అని రైనా చెప్పుకొచ్చాడు. మరి రైనా ధోని మీద ఉన్న అభిమానాన్ని తెలియజేసాడా? లేకపోతే తన గురించి తాను గొప్పలు చెప్పుకున్నాడు ? తెలియాల్సి ఉంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.