ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న గైక్వాడ్.. తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. భారత్ క్రికెట్ ఫ్యూచర్ స్టార్ గా పేరొందిన ఈ యువ సంచలనం.. జూన్ 2-3 తేదీల్లో విహహం ఉత్కర్ష పవార్ ని చేసుకోబోతున్నాడు. ఇంతకీ ఈ ఉత్కర్ష పవార్ ఎవరంటే?
ఐపీఎల్ స్టార్ రుతురాజ్ గైక్వాడ్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయం ఇటీవలే అధికారికంగా ఈ యంగ్ బ్యాటర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ జరుగుతున్నప్పుడే డబ్ల్యూటీసీకి స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపికైన రుతురాజ్.. ఈ తన పెళ్లి గురించి తెలియజేయడంతో ఆ స్థానంలో యశస్వి జైస్వాల్ ని ఎంపిక చేశారు. ఐపీఎల్ 2021 సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన గైక్వాడ్.. 2023 సీజన్లోనూ 590 పరుగులు చేసి ఓపెనర్ డివాన్ కాన్వేతో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ప్రస్తుతం 26 ఏళ్ళ ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ ఉత్కర్ష పవార్ ని వివాహం చేసుకుంటున్నాడు. ఇంతకీ ఈ ఉత్కర్ష పవార్ ఎవరంటే?
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న గైక్వాడ్.. తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. భారత్ క్రికెట్ ఫ్యూచర్ స్టార్ గా పేరొందిన ఈ యువ సంచలనం.. జూన్ 2-3 తేదీల్లో విహహం చేసుకోబోతున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఉత్కర్ష పవార్‌తో కలిసి ఐపీఎల్ ట్రోఫీతో ఫోటోలు దిగిన రుతురాజ్ గైక్వాడ్.. మాహీతో దిగిన ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. పూణేకి చెందిన ఉత్కర్ష పవార్, మహారాష్ట్ర తరుపున దేశవాళీ టోర్నీలు ఆడుతుంది. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన ఉత్కర్ష, రైట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేస్తూ ఆల్‌రౌండర్‌గా రాణిస్తోంది. అక్టోబర్ 13, 1998లో పుట్టిన ఈమె.. 11 ఏళ్ల వయసు నుంచి క్రికెట్ ఆడుతోంది. ఇక ఆటతో పాటుగా పూణేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ సైనెన్స్‌లో చదువుకుంటోంది. మరి గైక్వాడ్ కాబోయే భార్య కూడా మహిళా క్రికెటర్ కావడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.