మరికొన్ని గంటల్లో యూఏఈ వేదికగా ఐపీఎల్ సెకెండ్ హాఫ్ సందడి షురూ కానుంది. క్రికెట్ అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించే వార్త తొలి మ్యాచ్‌లోనే దిగ్గజ టీమ్‌లు పోటీకి సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 19న చెన్నై సూపర్ కింగ్స్, ది ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి. 7 మ్యాచ్‌లలో ఐదు నెగ్గి పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉంది సీఎస్కే. ఏడు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు, 3 పరాజయాలతో నాలుగోస్థానంలో ఉంది ముంబయి. విజయాల సంగతి పక్కన పెడితే విదేశీ ఆటగాళ్ల నుంచి సీఎస్కేకి తగిలిన షాక్‌ల కారణంగా కొందరు దిగ్గజ ఆటగాళ్లు దూరమయ్యారు. ముంబయి మాత్రం దాదాపు ఎలాంటి మార్పులు లేకుండా ఫస్ట్ హాఫ్ జట్టుతోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరి ముంబంయి టీమ్ ఎలా ఉండబోతోందో ఒక అంచనా వేద్దాం.
సీపీఎల్, శ్రీలంక-దక్షిణాఫ్రికా సిరీస్ ప్లేయర్లకు క్వారంటైన్ గడువు రెండ్రోజులకు కుదించాలన్న బీసీసీఐ నిర్ణయంతో క్వింటన్ డీ కాక్‌కు లైన్ క్రియర్ అయ్యింది. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో బాగా ఫామ్‌లో కనిపించిన డీకాక్.. హిట్‌మ్యాన్‌తో కలిసి మంచి ఆరంభాన్ని అందించగలడు. డీకాక్ ఎంట్రీతో మరోసారి ఆస్ట్రేలియా ప్లేయర్ క్రిస్ లైన్‌కు నిరాశ ఎదురైంది. ఫస్ట్ డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్, తర్వాత ఇషాన్ కిషన్ బరిలో దిగే అవకాశం ఉంది. డికాక్ కీపర్‌గా ఉన్నా బ్యాట్స్‌మెన్‌గా ఇషాన్ కిషన్ ఆడనున్నాడు. వీరి తర్వాత హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో బ్యాటింగ్ దిగే అవకాశం ఉంది. మొదటి పార్ట్‌లో తీవ్రంగా నిరాశ పరిచిన హార్దిక్ ఈసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న పొలార్డ్ మరోసారి ముంబయి మంచి సపోర్ట్ అనే చెప్పాలి. పెదటి పార్ట్‌లో దుమ్మురేపిన పొలార్డ్ సెకెండ్ హాఫ్‌ను కూడా అదే విధంగా కొనసాగిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వీరి తర్వాత కృనాల్ పాండ్యా బరిలోకి దిగుతాడు. కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్‌లు స్పిన్ పిచ్‌లపై ముంబయికి కీలక ఆటగాళ్లు అయ్యే అవకాశం లేకపోలేదు. బౌలింగ్ పరంగా పేస్ విభాగానికి జాస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ద్వయం ఉంది. మరో పేసర్ కావాలనుకుంటే మార్క్ జాన్సన్, స్పిన్నర్ కావాలంటే పియూష్ చావ్లా ఉన్నారు. కృనాల్ పాండ్యా బౌలింగ్ పరంగా కూడా బాగా రాణిస్తున్న నేపథ్యంలో మరో స్పిన్నర్‌ను తీసుకునే అవకాశం కనిపించడంలేదు. కావున జాన్సనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డీకాక్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, పొలార్డ్(వైస్ కెప్టెన్), కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, జాస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మార్క్ జాన్సన్/పియూష్ చావ్లా.
ముంబయి, సీఎస్కే మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.