ప్రస్తుతం టీమిండియా జట్టు దిగ్విజయాలతో దూసుకెళ్తోంది. వరుసగా ఆసియా కప్ విజేత అయిన శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్ లను కైవసం చేసుకుంది. అదే జోరును న్యూజిలాండ్ పై కూడా చూపించి మూడు వన్డేల సిరీస్ లను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక త్వరలో ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ దూసుకెళ్లడానికి ఇది కీలకమైన సిరీస్. అయితే మంచి జోరుమీదున్న టీమిండియా బౌలింగ్ దళాన్ని ఎదుర్కొవడం మాకు సవాలే అని ఆసిస్ బ్యాటర్ వ్యాఖ్యాన్నించాడు. మరీ ముఖ్యంగా అతడి బౌలింగ్ ఆడటం ఎడమ చేతి బ్యాటర్లకు గగనం అంటూ.. టీమిండియా బౌలర్ ను ప్రశంసించాడు. మరి ఇంతలా ఆసిస్ బ్యాటర్లను భయపెడుతున్న ఆ బౌలర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అందులో భాగంగా నాలుగు టెస్టు మ్యాచ్ లను ఆడనుంది టీమిండియా. అయితే ఈ టెస్ట్ సిరీస్ భారత్ కు చాలా కీలకమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత్ ఫైనల్ కు వెళ్లాలి అంటే కచ్చితంగా.. 2-1 తేడాతో భారత్ ఆసిస్ ను ఓడించాలి. అప్పుడు టీమిండియా అగ్రస్థానంలోకి దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే టీమిండియా బౌలర్ పై ప్రశంసలు కురిపించాడు ఆసిస్ స్టార్ బ్యాటర్ రెన్ షా. భారత సీనియర్, స్టార్ బౌలర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ ను ఎదుర్కొవడం ఎడమచేతి బ్యాటర్లకు సవాల్ అని పేర్కొన్నాడు రెన్ షా.
అశ్విన్ చాలా తెలివైన బౌలర్, అతడికి ఎప్పుడు ఎలా బంతులు సంధించాలో బాగా తెలుసు అని రెన్ షా అన్నాడు. ఇక బంతిని విభిన్నంగా సంధించడంలో అశ్విన్ సిద్దహస్తుడు అని షా కొనియాడాడు. స్పిన్ ను అనుకూలించే పిచ్ లపై అశ్విన్ లాంటి బౌలర్ ని ఎదుర్కొవడం బ్యాటర్లకు చాలా కష్టంమని, ముఖ్యంగా ఎడమచేతి బ్యాటర్లకు అతడి బౌలింగ్ ను ఢీకొనడం పెద్ద సవాలే అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఇక ఆసిస్ జట్టులో ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, అలెక్స్ కేరీ లాంటి ఎడమ చేతివాటం కలిగిన బ్యాటర్లు ఉన్న సంగతి మనకు తెలిసిందే. మరి అశ్విన్ ను చూసి భయపడుతున్న ఆసిస్ ప్లేయర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Australia batter Matt Renshaw has conceded that spinner Ravichandran Ashwin will be one of the toughest bowlers to face in the four-Test series in India beginning February 9.https://t.co/XsGxPifnHv
— Express Sports (@IExpressSports) January 25, 2023